ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా... ఈనెల 17న ఒక్క గంటలో కోటి మొక్కలు నాటనున్నట్లు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధనకు తెలంగాణ భావజాల వ్యాప్తి ఎలా ఉపయోగపడిందో, అలాగే రాష్ట్రాన్ని పర్యావరణ పరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేస్తామని సంతోష్ కుమార్ అన్నారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయని తెలిపారు. సీఎం కేసీఆర్ను అభిమానించే వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడారంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అలాగే... ఈ నెల 16, 17 తేదీల్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి: పదో తరగతిలో సగం ఛాయిస్.. విద్యార్థులు యమా ఖుష్