కరోనా కట్టడికి ప్రజా ప్రతినిధులు నూతన ఒరవడితో ముందుకు సాగుతూ ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.కొవిడ్ నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కట్టడికి తెరాస నేత ఎడ్ల హరిబాబు యాదవ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన రసాయనాలు పిచికారీ చేసే యంత్రాలను ముషీరాబాద్ లో శాసనసభ్యుడు ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఇద్దరు యువకులు ఆ యంత్రాలను వాహనంపై పెట్టుకొని వీధివీధిన తిరిగి సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేశారు. కరోనా నియంత్రణకు పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి ప్రజల్లో భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చైతన్య పరచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.