Minor Girl Gang Rape in Hyderabad : ప్రస్తుత కాలంలో ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలూ ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, నిందితులను ఎంత కఠినంగా శిక్షించినా కీచకుల అఘాయిత్యాలు (Atrocities) ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది.
Minor Girl Gang Rape Case On Madura Nagar : మధురానగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మోతీనగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తమ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఎస్ఆర్ నగర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. బాలిక అక్కకు గత ఫిబ్రవరిలో సాయి అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలికపై సాయి స్నేహితుడు కన్నేశాడు.
గత నెల 25వ తేదీ ఉదయం ఆ బాలిక ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం కిరాణా దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో యువతి బావ మిత్రుడైన యువకుడు గమనించి అప్పటికే అక్కడ నిలిపి ఉంచిన కారులో మైనర్‌ను కిడ్నాప్ చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొబ్బుగూడ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కారును ఆపి బాలికపై తన బావ స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన అక్కను చంపేస్తామని బాలికను నిందితులు బెదిరించినట్లు పోలీసులు వివరించారు.
ఇంట్లో డ్రాప్ చేస్తానని.. మైనర్ బాలికపై అత్యాచారం
Telangana Crime News : బాధితురాలు జరిగిన ఘోరాన్ని తండ్రితో చెప్పలేకపోయిందని పోలీసులు తెలిపారు. తల్లి గుంటూరులో ఉండటంతో తండ్రితో కలిసి అక్కడికి వెళ్లిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లితో చెప్పిందన్నారు. అక్కడి నుంచి తల్లితో కలిసి ఆ బాలిక ఈ నెల 5వ తేదీన మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నేరం జరిగిన ప్రదేశం సనత్‌నగర్ పీఎస్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Sexual Harassment on Minor Girls in Hyderabad : చాక్లెట్ ఆశచూపించి మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై పోక్సో కేసు
Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం