Bail to Kuna Ravikumar: తెదేపా నేత కూన రవికుమార్‌కు బెయిల్ - ap news
ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన తెదేపా నేత కూన రవికుమార్‌కు.. షరతులతో కూడిన బెయిల్(Bail to Tdp Leader Kuna Ravikumar) మంజూరైంది. శనివారం అర్ధరాత్రి పోలీసులు రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే..

తెదేపా నేత కూన రవికుమార్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు(Bail to Kuna Ravikumar) చేసింది. శనివారం పార్టీ కార్యాలయానికి బయల్దేరిన రవికుమార్‌ను.. ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులపై కూన రవికుమార్ దుర్భాషలాడినట్టు సీఐ ఈశ్వర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీలోని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
353, 506, సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సోదరుని ఇంట్లో ఉన్న కూన రవి కుమార్‌ను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటల సమయంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు(tdp leader kuna ravikumar arrest) తీసుకెళ్లారు. అనంతరం న్యాయస్థానంలో హాజరు పరచగా.. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు అర్ధరాత్రి వచ్చి ఇంటివద్ద నానా హంగామా చేయడంతో.. తన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పోలీసుల కుటుంబ సభ్యుల ఇంటికెళ్లి ఇలానే చేస్తే.. ఎలా ఉంటుంది అని కూన రవికుమార్ ప్రశ్నించారు.
రవికుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.. లోకేశ్
తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ అక్రమ అరెస్టును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా(nara lokesh on tdp leader kuna ravikumar arrest) ఖండించారు. 'అర్ధరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి కూన రవికుమార్‌ను అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ.. వాతావరణశాఖ హెచ్చరికలపై పెడితే రాష్ట్రంలో ఇంత ప్రాణ, ఆస్తి నష్టం ఉండేది కాదు. వరదల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారు. బాధితులకు కనీసం ఆహారం, తాగునీరు ఇచ్చే దిక్కు లేదు. సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యల్లో బిజీ అయిపోయారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: koona ravi kumar arrest : అర్ధరాత్రి సమయంలో.. తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు