Leopard Trapped in Cage Tirumala : తిరుమలలో వన్యమృగాల సంచారం ఓవైపు భక్తులకు.. మరోవైపు అధికారులకు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల నడ మార్గంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. వన్యమృగాల సంచారాన్ని పసిగట్టేందుకు కెమెరాలు.. వాటిని బంధించడానికి బోన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మూడు చిరుతలను పట్టుకున్నారు. వారం రోజుల వ్యవధిలో బోనులో మూడు చిరుతలు(Tirumala Stairway News) చిక్కడంతో అధికారులు.. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా తిరుపతిలో చిరుతల సంచారంతో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు
Tirumala Leopard Latest News : ఇక ఇప్పుడు తాజాగా అధికారులకు మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్ చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తాజాగా చిక్కిన చిరుతతో ఇప్పటి వరకు బంధించిన చిరుతల సంఖ్య నాలుగుకు చేరిందని తెలిపారు. తొలుత ఒక చిరుతను ట్రాప్ చేయగా.. ఆ తర్వాత రెండు, ఇప్పుడు మరొకటి బోనులో చిక్కాయని చెప్పారు.
Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి
నాలుగో చిరుత(Tirumala Cheetah Attack)ను బోనులో బంధించేందుకు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. తాము చర్యలు తీసుకుంటున్నా భక్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నడక మార్గంలో వెళ్లే వారు గుంపులు గుంపులుగా వెళ్లాలని.. ముఖ్యంగా పిల్లలను వదిలి పెట్టకూడదని.. తమ దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా తీసుకువెళ్లాలని చెప్పారు.
తిరుమలలో భక్తులపై ఆంక్షలు : తిరుపతి నుంచి తిరుమల నడకదారుల్లో అడవి జంతువుల దాడి ఘటనల నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు భక్తులపై ఆంక్షలు విధించింది. 2 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy) వెల్లడించారు. పెద్దలను రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. అలాగే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
సీరియల్ షూటింగ్లో మళ్లీ చిరుత కలకలం.. పది రోజుల్లో నాలుగోసారి!