ETV Bharat / state

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాల కొరత

author img

By

Published : Apr 25, 2021, 7:47 PM IST

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ​ఆరోగ్య కేంద్రాల్లో డిమాండ్​కు తగ్గ వసతులు లేక.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Lack of facilities in health centers
Lack of facilities in health centers

గ్రేటర్ హైదరాబాద్​లోని ఆరోగ్య కేంద్రాల్లో.. సౌకర్యాల కొరత వేధిస్తోంది. కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో వ్యాధి నిర్ధరణ పరీక్షలకు వచ్చే ప్రజలు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా ఎండలో పడిగాపులు కాసి.. టెస్టింగ్​ కిట్లు లేక, వ్యాక్సిన్ కొరత కారణంగా నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్రాల్లో.. బాధితులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక రోడ్లపైన గంటల తరబడి నిలబడుతూ అవస్థలు పడుతున్నారు.

ముషీరాబాద్, భోలక్ పూర్​లోని రంగానగర్, దోమల్​ గూడలోని గగన్ మహల్, కవాడిగూడలోని నెహ్రూ నగర్​ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కరోనా అనుమానిత బాధితులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ​ఆరోగ్య కేంద్రాల్లో డిమాండ్​కు తగ్గ వసతులు లేక.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగా నగర్​లో ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తోన్న ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడు తరలించాల్సి వస్తుందోనని… సిబ్బంది, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్, భోలక్ పూర్ ఆరోగ్య కేంద్రాలు రెండు.. సికింద్రాబాద్​కు సమీపంలో ఉండటం వల్ల జనాలు పెద్ద ఎత్తున ఈ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సిబ్బంది లేమి.. ఈ కేంద్రాల్లో సమస్యగా మారింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో.. పట్టణ ఆరోగ్య కేంద్రాల సౌకర్యాల విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఒక్క ముషీరాబాద్ నియోజకవర్గంలోనే.. నేడు 250 మందికి పరీక్షలు నిర్వహించగా 49 మందికి కరోనా పాజిటివ్​గా తేలడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇదీ చదవండి: 'నేను చనిపోతే దానికి కారణం ఎస్సై, సీఐ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.