Kishan Reddy reaction on Munugode By Poll Result: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతిక విజయం భాజపాదేనని స్పష్టం చేశారు. తాము ఎన్నికలో ఓడినా.. మునుగోడు ప్రజల నమ్మకాన్నిగెలిచామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో తెరాస గెలిచిందని ఆరోపించారు. మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల కుటుంబానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే.. కేసీఆర్ పాలనను అంతం చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నిక.. ఓటమిపై కారణాలు వెతుక్కుంటున్న భాజపా