ETV Bharat / state

Kishan Reddy Interesting Comments : 'అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం' - కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy Interesting Comments : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇరు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 1:55 PM IST

Kishan Reddy Interesting Comments అధికారం శాశ్వతం కాదు ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం

Kishan Reddy Interesting Comments in Hyderabad : ఆర్టికల్‌ 370ని తొలగించిన చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చింది మోదీ సర్కార్‌ అని గుర్తు చేశారు. పాక్‌ ఐఎస్‌ఐ ద్వారా రూ.లక్షల కోట్లు భారత్‌లో చలామణి అయ్యేదని.. కానీ అక్రమ చలామణి కట్టడికి పెద్ద నోట్లు రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy Fires on CM KCR : '30 రోజులు పోరాడితే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చు'

Kishan Reddy Fires on BRS Govt : ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. భవిష్యత్‌లో పార్టీలోకి భారీగా చేరికలుంటాయని కిషన్‌రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. పోరాటాలు, ఉద్యమాలు చేసిన తర్వాత కూడా.. తెలంగాణ మాఫియా చేతుల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని తెలిపారు. బీజేపీపై కొంత మంది కారు కూతలు కూస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy Comments on BRS and Congress : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేద్దామని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పని చేద్దామని.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి.. బీఆర్ఎస్ (BRS) బీ టీమ్‌గా ఉందని ఆరోపించారు. హస్తం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి రెండు పార్టీలకు.. ఏ టీమ్ ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. బీజేపీ తెలంగాణ ప్రజల టీమ్ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

"ఆర్టికల్‌ 370 తొలగించిన చరిత్ర మోదీ ప్రభుత్వానిది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చింది మోదీ ప్రభుత్వం. పాక్‌ ఐఎస్‌ఐ ద్వారా రూ.లక్షల కోట్లు భారత్‌లో చలామణి అయ్యేది. అక్రమ చలామణి కట్టడికి పెద్ద నోట్లు రద్దు చేసిన చరిత్ర బీజేపీది. బీజేపీ కార్యకర్తలంతా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేద్దాం. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పని చేద్దాం. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Reaction on BRS Manifesto : బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మడం లేదు : కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పని చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. హస్తం పార్టీ దోపిడీ, హత్యల పాలన.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్‌ పాలన చూశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించనున్నట్లు చెప్పారు. కర్ణాటకను 5 నెలల్లో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. గ్యారంటీ పథకాలను అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Kishan Reddy Fires on BRS : "బీఆర్​ఎస్​, కాంగ్రెస్​కు వ్యతిరేకంగా.. యువత నిశ్శబ్ధయుద్దం చేస్తోంది"

Kishan Reddy Counter To Rahul Gandhi Statement : కాంగ్రెస్‌, బీఆర్​ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.