Flight Ticket Charges Increased : సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణాల్లోని ప్రజలంతా పెద్ద ఎత్తున తమ తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మూడు, నాలుగు నెలల క్రితమే ట్రైన్‌కు రిజర్వేషన్ చేసినా వెయిటింగ్ లిస్టులు మాత్రం భారీగా ఉన్నాయి. ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసినా నిమిషాల వ్యవధిలోనే సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుంటున్నారు. దీంతో విమాన టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
కనీస ఛార్జీ రూ. 17 వేల పై మాటే : హైదరాబాద్, బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్లాలనుకునే వారికి విమాన టికెట్ ధరలు షాక్ ఇచ్చాయి. జనవరి 11 శని, 12 ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కనీస ఛార్జీ రూ.17,500కి పై మాటే ఉండటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్లాలంటే కనీసం రూ.12 వేలు పెట్టాల్సిందే. నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ వెళ్లాలంటే రూ.50 వేల నుంచి 70 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి కనీస ధర మాములుగా రూ.3,400 నుంచి రూ.4 వేలు ఉంటుంది. ప్రస్తుతం దానికి భిన్నంగా మూడు నాలుగు రెట్లు పెరిగింది. అయినప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాసతో కొంత మంది వేలకు వేలు పెట్టుకొని మరీ కుటుంబాలతో ప్రయాణాలు సాగిస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖకు పట్టాలపై విమానం టికెట్ ధర ఎంతంటే