ETV Bharat / state

'భూములు లాక్కుంటే రైతులెక్కడికి వెళ్లాలి' - kisan congress state president anvesh reddy

యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం పరిధిలో దాదాపు 60 ఏళ్ల నుంచి సాగుచేస్తున్న రైతుల భూములను కేసీఆర్​ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి ఆరోపించారు.

'భూములు లాక్కుంటే వారు ఎక్కడికి వెళ్లాలి'
author img

By

Published : Sep 30, 2019, 11:52 PM IST

'భూములు లాక్కుంటే వారు ఎక్కడికి వెళ్లాలి'

రాచకొండ ప్రాంతం రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని 15 వేల ఎకరాల సాగుభూమిని కేసీఆర్​ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న వారి భూములకు పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వారికి జీవనాధారమైన భూములను లాక్కుంటే వారంతా ఎక్కడికి పోవాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్వేశ్​ డిమాండ్‌ చేశారు.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.