ETV Bharat / state

KCR speech in TRS plenary: ఈసీ చిల్లరమల్లర పనులు మానుకోవాలి - హైదరాబాద్ వార్తలు

నవంబర్​ 4వ తేదీ వరకే ఈసీ దళితబంధును ఆపగలదని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ద్విదశాబ్ది వేడుకల్లో ఆయన ఈసీపై స్పందించారు.

KCR speech in TRS plenary
కేసీఆర్
author img

By

Published : Oct 25, 2021, 2:29 PM IST

ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోపించారు. సాగర్ సభ పెట్టవద్దని హైకోర్టులో కేసులు వేశారని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించవద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఈసీ చిల్లరమల్లర పనులు మానుకోవాలిని హెచ్చరిస్తున్నా. ఒక సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నా. ఎన్నికల సంఘం గౌరవప్రదంగా వ్యవహరించాలి. నవంబరు 4వ తేదీ వరకే ఈసీ దళితబంధు అమలును ఆపగలదు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతడు. నవంబరు, డిసెంబర్‌లో దళితబంధు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం.

- కేసీఆర్, తెరాస అధ్యక్షుడు

హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎన్నికల సంఘం ఏం చేసినా నవంబరు 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతుందన్నారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడని ధీమా వ్యక్తం చేశారు. దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్ఞాపనలు వస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు మాకు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.