దక్షిణ తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయే నివర్ తుపాను కారణంగా, 2 రోజుల పాటు రైలు సర్వీసుల పట్టికలో మార్పు వచ్చే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. నివర్ వల్ల భారీ గాలులు, వర్షపాతం సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిపే రైలు సర్వీసులపై ఇది ప్రభావం చూపించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసే ఆస్కారం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం నివర్ ప్రభావితం అయ్యే ప్రధాన స్టేషన్లలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.
- సికింద్రాబాద్: 040 - 27833099
- విజయవాడ: 0866 - 2767239
- గుంతకల్: 7815915608
- గుంటూరు: 0863 - 2266138
ఈ హెల్ప్ నంబర్ల ద్వారా రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: చేనేత సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరా..