ETV Bharat / state

Husband killed wife on electric shock : కరెంట్‌షాక్‌తో భార్యను చంపిన భర్త.. పోలీసుల ఎదుట కట్టుకథలు - husband who killed his wife

Husband killed his wife with electric shock : ఏడు అడుగులు వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన భర్త .. భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో తన భార్య షాక్‌కు గురై చనిపోయినట్లు బోరునా విలపించాడు. పోలీసులు వచ్చి తమదైన శైలీలో విచారించగా.. మనోడి అసలు రంగు బయటపడింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

electric shock
electric shock
author img

By

Published : May 16, 2023, 7:22 PM IST

Husband killed his wife with electric shock : భార్య భర్తల మధ్య చెలరేగిన చిన్న ఘర్షణ చినికి చినికి గాలి వానల మారి చివరకి కట్టుకున్న భార్యనే భర్త హత్య చేసినంత వరకు తీసుకొచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా మాట ఇచ్చిన భర్త.. భార్యను అత్యంత క్రూరంగా కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియని వ్యక్తిలా బోరున విలపిస్తూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఖాకీల దగ్గర మనోడి ఆగడాలు పనికొస్తాయా..! ఇట్టే పసిగట్టే అసలు విషయం బయటపెట్టారు.

ఇది జరిగింది: పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన యాదయ్య తన భార్య కవితను ఇవాళ ఉదయం కరెంట్ షాక్ పెట్టి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత నిందితుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్య విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఫిర్యాదు చేశాడు. అనంతరం మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె ఒంటిపై గాయాలను గమనించారు.

దీంతో అనుమానం వచ్చి యాదయ్యను తమ స్టైల్‌లో విచారించగా అసలు విషయం చెప్పేశాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. తన భార్యకు తనకు చిన్న విషయంలో తగాదా జరిగిందని ఈ క్రమంలో ఆవేశంతో తన భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఘటనకు సంబంధించి వారి మధ్య వచ్చిన వివాదం ఏంటి అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

భార్యని చంపి భర్త ఆత్మహత్య: నగరంలో వరుస హత్య కేసులు మరింత కలిచి వేస్తున్నాయి. ఎల్లారెడ్డి గూడలో జనర్థన్‌ అనే వ్యక్తి తన భార్యను మద్యం మత్తులో ఇనుప రాడ్‌తో చంపి.. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. గత కొంత కాలంగా భార్యభర్తలకు తరచూ గొడవలు జరగగా.. ఇవాళ మద్యం మత్తులో ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.