కొవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పలువురు ప్రముఖులు, సంస్థలు చేయూతనిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎం సహాయనిధికి అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకట రమణ, సెక్రటరీ శ్రీనివాస రావు, సభ్యుడు ఓఎన్ రెడ్డిలు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ. 2.50 లక్షలను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చారు.
గ్రీన్ కో గ్రూప్ తరఫున ఎండీ అనిల్ చలమల శెట్టి రూ. 5 కోట్ల విలువైన లక్ష పీపీఈ కిట్లు, మైత్రా ఎనర్జీ గ్రూప్ తరఫున ఎండీ విక్రమ్ కెలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్లు రూ. 2.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చారు. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ. 2 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వీరు ఇందుకు సంబంధించిన కాన్సెంట్ లెటర్లను సీఎం కేసీఆర్‌కు అందించారు.
శ్రీరామచంద్ర మిషన్ రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, తెరాస కార్యకర్తలు రూ. 7.41 లక్షలను విరాళమివ్వగా... దీనికి సంబంధించిన చెక్కును మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం కేసీఆర్‌కు అందించారు.
ఇవీచూడండి: ఆ విషయం గురించి కేటీఆర్‌తో మాట్లాడా: కిషన్‌రెడ్డి