ETV Bharat / state

ఆన్​లైన్​ బైక్​ ట్యాక్సీ యాప్స్​తో ఆఫీసుకే ఇంటిభో"జనం" బాట - హైదరాబాద్ లైఫ్​ స్టైల్​ వార్తలు

Home food delivery to offices by bike taxi: నేటి కాలంలో టెక్నాలజీ పుణ్యమా అని మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఆఫీసుకు వెళ్లెముందు లంచ్​బాక్సు తీసుకెళ్లెవారు. ఒకవేళ ఇంట్లో వంట చేయడం ఆలస్యమయితే బయట తినేవారు. ఆన్​లైన్​ డెలివరీ సేవలు బాగా అందుబాటులోకి రావడంతో ఇంటి నుంచి భోజనాన్నే ఆఫీసుకు తెప్పించుకుంటున్నారు.

Home food delivery
Home food delivery
author img

By

Published : Jan 19, 2023, 2:45 PM IST

Updated : Jan 19, 2023, 3:05 PM IST

Home food delivery to offices by bike taxi: నగరంలో వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్నం పూట తినేందుకు ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదివరకైతే ఉదయం తమతోపాటు లంచ్‌బాక్స్‌లను ఆఫీసులకు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం నగరంలో బైక్‌ ట్యాక్సీ యాప్‌ సేవలు అందుబాటులోకి వచ్చాక.. లంచ్‌ సమయానికి వేడివేడి భోజనాన్ని ఇంటి నుంచి తెప్పించుకుంటున్నారు.

ఇటీవల తమ బుకింగ్‌లలో ఇవి పెరిగాయని సంబంధిత యాప్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ముంబయి మహానగరంలో లంచ్‌బాక్స్‌లను కార్యాలయాలకు చేరవేసేందుకు డబ్బావాలాలు ఉన్నారు. అక్కడ ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో లంచ్‌బాక్స్‌లు మధ్యాహ్నం వేళకు ఆఫీసులకు చేరుతుంటాయి. మన దగ్గర ఇలాంటి సేవలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రస్తుతం

* బంధుమిత్రులకు బహుమతులు అందజేయడానికి, ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన వస్తువులు మర్చిపోయినప్పుడు ఎక్కువగా బైక్‌ ట్యాక్సీ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు లంచ్‌బాక్స్‌ల డెలివరీలు పెరిగాయి.

‘నాకు ఇష్టమని మా ఆవిడ కాకరకాయ కర్రీ చేసింది. ఆ రోజు వంట ఆలస్యం కావడంతో నేను కార్యాలయానికి వచ్చేశాను. అనంతరం ట్యాక్సీ యాప్‌ బుక్‌చేసి మరీ లంచ్‌బాక్స్‌ తెప్పించుకున్నా.’ అని రాజు తను అనుభవాన్ని పంచుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 19, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.