లాక్డౌన్ సమయంలో శుభ, వివాహ ఇత్యాది కార్యక్రమాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న అర్చకులు, పురోహితులు, పేద బ్రాహ్మణులకు సేవా భారత్ క్రైస్తవ సంస్థ మానవతా దృక్పథంతో నిత్యావసర సరుకుల పంపిణీకి ముందుకువచ్చారు.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని వినాయక దేవాలయంలో సేవా భారత్ సంస్థ వారు పురోహితులకు ఒక్కొక్కరికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. కులమతాలకు అతీతంగా పురోహితులను ఆదుకున్నందుకు బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేశారు.