ETV Bharat / state

మెజార్టీ రాలేదు.. మరి మేయర్ ఎన్నిక ఎలా ఉంటుంది! - జీహెచ్​ఎంసీ మేయర్ ఎన్నిక

మేయర్ ఎన్నిక కోసం సాధారణ మెజార్టీయే అవసరం కానీ, ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి మాత్రం కోరం తప్పనిసరి. ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల్లో సగానికి పైగా మంది హాజరవుతేనే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. బల్దియా ఫలితాలతో ఉత్కంఠను రేకెత్తిస్తోన్న మేయర్ ఎన్నిక విధానంపై కథనం...

ghmc elections 2020
ghmc elections 2020
author img

By

Published : Dec 7, 2020, 3:45 PM IST

బల్దియా పోరు ముగిసి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నగరవాసి ఏ ఒక్కరికీ స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది. ఎవరికి వారు తోచిన లెక్కలు చెప్తున్నారు. భిన్నవాదనలు వినిపిస్తున్నారు. అసలు మేయర్ పదవికి ఎన్నిక ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.

మొదటి సర్వసభ్య సమావేశంలోనే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎన్నికల నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక జరిగే పాలకమండలి మొదటి ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. ఎన్నిక తేదీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జిల్లా కలెక్టర్ లేదా సంయుక్త కలెక్టర్​ను ఎన్నికకు అథారిటీగా ఎస్ఈసీ నియమిస్తుంది.

విప్​ వర్తిస్తుంది

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశానికి కోరం తప్పనిసరి. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్​అఫిషియో సభ్యులతో కలిసి సగానికంటే ఎక్కువమంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. కోరం లేకపోతే మరుసటి రోజే మళ్లీ సమావేశపరిచి ఎన్నిక చేపడతారు. వరుసగా రెండో రోజు కూడా కోరం లేకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఆ తర్వాత ఎస్ఈసీ నిర్ణయించిన తేదీలో కోరం ఉన్నా, లేకపోయినా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్ జారీ చేసి ఆ విషయాన్ని ఎన్నికల అథారిటీకి తెలపాల్సి ఉంటుంది.

విప్​ ధిక్కరిస్తే...

ఆయా పార్టీల తరఫున ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు విప్​నకు అనుగుణంగా ఓటువేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విప్ ధిక్కరిస్తే వారిపై పార్టీల ఫిర్యాదుకు అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారి సంబంధిత సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే సదరు సభ్యుని ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. మేయర్ ఎన్నిక కోసం ఏదైనా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు ఒకరు ప్రతిపాదించాలి... మరొకరు బలపర్చాల్సి ఉంటుంది.

సమాన ఓట్లు వస్తే...

ఒకే అభ్యర్థి పేరును ప్రతిపాదించినట్లైతే ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రతిపాదిస్తే సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు సభ్యులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. మేయర్ ఎన్నికలు పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి వీలు లేదు.

తెరాసకే ఎక్కువ బలం

ప్రస్తుత బల్దియా బలాబలాల్లో తెరాసకు 55 మంది కార్పొరేటర్లు, మరో 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం 86 మంది సభ్యులున్నారు. భాజపాకు 48 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 51 మంది బలం ఉంది. మజ్లిస్​కు 44 మంది కార్పొరేటర్లు, పది మంది ఎక్స్ అఫిషియోతో కలిసి 54 మంది సంఖ్యాబలం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలంటే కోరం కోసం రెండు పార్టీల సభ్యులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.

ఎన్నిక సమయంలో మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే తెరాస అభ్యర్థి మేయర్ అవుతారు. తెరాస, భాజపా పోటీ చేసి మజ్లిస్ తటస్థంగా ఉన్నా తెరాస అభ్యర్థి గెలుపు ఖాయం. ఒకవేళ కేవలం తెరాస అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.