ETV Bharat / state

'గ్రేటర్​లో 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించాం' - ghmc commissoner lokesh kumar on street vendors in hyderabad

కింద గ్రేటర్​ హైదరాబాద్​లో చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించామని.. వారిలో 58, 435 మందికి గుర్తింపు కార్డు అందించామని జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తెలిపారు. వీరందరికి ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణాలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

ghmc commissoner lokesh kumar on street vendors in hyderabad
'గ్రేటర్​లో 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించాం'
author img

By

Published : Aug 18, 2020, 9:53 PM IST

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద గ్రేటర్​ హైదరాబాద్​లో చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్​ తెలిపారు. వారిలో 58, 435 మందికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల జీవనోపాధిని పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

పీఎం స్వనిధి కింద బ్యాంకుల ద్వారా రూ. పది వేల చొప్పున 9, 425 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించినట్లు లోకేశ్​కుమార్ పేర్కొన్నారు. ఈ పథకంలో వీధివ్యాపారులకు 7 శాతం వడ్డీతో రూ. పది వేల చొప్పున రుణం మంజూరవుతుందని లబ్ధిదారులు రుణాన్ని 12 నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలని వెల్లడించారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించిన ఈ ప్ర‌యోజ‌నాల‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీధి వ్యాపారుల‌కు లోకేశ్​కుమార్ సూచించారు.

ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.