స్వర్గీయ అటల్బిహారీ వాజ్‌పేయి జన్మదిన వేడుకలను మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పొంగులేటి, ఆకుల విజయ, పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాజ్‌పేయి పేరు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: టూరిజంలో హైదరాబాద్ నెంబర్ వన్