కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న మున్సిపల్ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నిజామాబాద్ భాజపా ఎంపీ అర్వింద్ కోరారు.
ఐస్ స్టాండ్ ఉమన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మయూరి చోడి గంజి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కవాడిగూడలో మున్సిపల్ కార్మికులకు శానిటైజర్, మాస్కులు సబ్బులు, నిత్యావసరాలను ఎంపీ అర్వింద్, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అందజేశారు. పని చేసే చోట ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చిరుత: అడవి నాదే..నగరం నాదే..