బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రతి జిల్లాల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని సీపీఐ (Cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (Chada venkata reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్లాక్ ఫంగస్ (Black Fungus) రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారని... ఇప్పుడు బ్లాక్ ఫంగస్, ఎల్లో, వైట్ ఫంగస్ వల్ల మరింత భయపడే ప్రమాదం ఉందన్నారు.
వెంటనే సమీక్ష నిర్వహించాలి
ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీ, కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు ఆసుపత్రిల్లో బెడ్లు లేకపోతే వారు ఇబ్బందులు పడతారని తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం 50 నుంచి 100 బెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. బ్లాక్‌ఫంగాస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సమీక్ష నిర్వహించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.