Congress Government on Gas Cylinder Scheme : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పౌర సరఫరాల శాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో మొదటిది రేషన్ కార్డు(ఆహార భద్రత కార్డు) ఉన్నవారితో పాటు రేషన్‌కార్డు లేనివారిలోనూ అర్హులను ఎంపిక చేయడం. రెండోది రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయడం.
1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు : తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు (Gas Connections in Telangana) ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో హెచ్‌పీసీఎల్ నుంచి 43,39,354, ఐఓసీఎల్ నుంచి 47,96,302, బీపీసీఎల్ నుంచి 29,04,338 ఉన్నట్లు పేర్కొంటున్నారు. మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మంది ప్రతి నెలా రీఫిల్ చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. అంటే సుమారు 52.80 లక్షల మంది నెలకు ఒక సిలిండర్ వినియోగిస్తున్నారని తెలియజేస్తున్నారు.
Ujjwala Yojana Subsidy Hike : కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పెంపు.. ఎంతంటే?
రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొలి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చని, అయితే అనర్హులూ లబ్ధిదారులయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావొచ్చని పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చిందని అంటున్నారు.
Cylinder in 500 Rupees Mahalakshmi Scheme : రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే సర్వే, లబ్ధిదారులను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఆ శాఖ అధికారులు ఆయా ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి (Minister Uttam Kumar Reddy) అందజేశారు. గురువారం అధికారికంగా నివేదిక అందించారు.
ఉజ్వల్‌వి 11.58 లక్షలు, రాయితీ వదులుకున్న వారు 4.2 లక్షల మంది : ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955గా ఉంది. ఒక్కో సాధారణ కనెక్షన్లపై బుకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.40 రాయితీ అందిస్తోంది. అదే ఉజ్వల్ కనెక్షన్లకైతే రాయితీగా రూ.340 ఇస్తోంది. తెలంగాణలో ఉజ్వల్‌వి 11.58 లక్షలు ఉన్నాయి. మరోవైపు గివ్ ఇట్ అప్‌లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన వినియోగదారుల్లో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై, అదనపు భారం ఆధారపడి ఉండనుంది.
Mahalakshmi Scheme in Telangana : మొత్తంగా ఈ పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు, సంవత్సరానికి ఆరు సిలిండర్లను ఒక్కోటి రూ.500కు ఇస్తే తెలంగాణ ప్రభుత్వంపై పడే భారం సుమారు రూ.2,225 కోట్లని పౌర సరఫరా అధికారులు లెక్కలు తేల్చారు. అదే ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేపక్షంలో అదనపు భారం రూ.4,450 కోట్లని పౌర సరఫరాల శాఖ అధికారులు లెక్కలు వేశారు.
రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరి కేవైసీ అంటూ పుకార్లు - క్యూ కట్టిన వినియోగదారులు
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?