ETV Bharat / state

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్​: కేసీఆర్​ - cm kcr on rythu bandhu

ఉపాధిహామీ పథకాన్ని ఎక్కువ శాఖల్లో ప్రజోపయోగ పనులు చేసేందుకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా నరేగా ఇంజనీర్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సీఎం... తన ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా చెత్తాచెదారం కనిపిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మేవారి సమాచారం ఇచ్చిన వారికి ఐదు వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనునట్లు ప్రకటించారు.

CM kcr met with collector in hyderabad on tueday
నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్​: కేసీఆర్​
author img

By

Published : Jun 17, 2020, 3:57 AM IST

Updated : Jun 17, 2020, 5:23 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశంలో గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధిహామీ పథకం, పల్లెప్రగతి,–గ్రామాల్లో పచ్చదనం, రైతుబంధు, –రైతువేదికల నిర్మాణం, ఆహారశుద్ధి సెజ్‌ల ఏర్పాటు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశనిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లేనన్న సీఎం... గ్రామ పంచాయతీలకు అన్ని రూపాల్లో ఏడాదికి 9,916 కోట్ల రూపాయలు సమకూరుతాయని... వాటితో ఏఏ పనులు చేసుకోవచ్చో గ్రామాలవారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలని... ట్రాక్టర్ల రుణాలు, కరెంటు బిల్లులు తప్పకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. పట్టణాలు, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నందున గతంలో వాడిన మోటార్లు తొలగించాలన్నారు.

అందరినీ భాగస్వాములు చేయాలి

విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థాయి సంఘాల సమావేశం క్రమం తప్పకుండా జరగాలన్న ముఖ్యమంత్రి... 8,20,727 మంది సభ్యులతో ఉన్న ఈ సైన్యాన్ని క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వాములను చేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. 13,993 మంది అధికారులు కేవలం గ్రామాభివృద్ధి కోసమే ఉన్నారని... వారంతా ప్రతి రోజు పర్యవేకక్షించి, విధులు సక్రమంగా నిర్వహిస్తే గ్రామ వికాసం చాలా వేగంగా, అనుకున్న విధంగా జరుగుతుందని తెలిపారు.

ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్లాలి

ప్రతి ఏటా పది వేల కోట్ల నిధులు,13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజా ప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, కలెక్టర్లకు విస్తృత అధికారాలున్న ప్రస్తుత తరుణంలో మార్పు రాకుంటే, గ్రామాలు బాగుపడకుంటే ఇక ఎప్పటికీ మార్పు రాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలని కోరారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో పరిస్థితి మారిందని... ఈ స్పూర్తి కొనసాగాలని అన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవన్న సీఎం... ఇదొక అద్భుతం, ఇదొక విప్లవంగా అభివర్ణించారు.

చెత్తా చెదారం, ముళ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు

రెండు నెలల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పల్లె ప్రగతి పేరుతో అప్పుడప్పుడు కార్యక్రమం నిర్వహించడం కాకుండా ప్రతి రోజు ప్రతి గ్రామం శుభ్రం కావాల్సిందేనని అన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు రావని, రోగాలు దరిచేరక ఆరోగ్యం కోసం అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తాను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న కేసీఆర్... ఎక్కడైనా చెత్తా చెదారం, ముళ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్థికసంఘం నిధుల్లో పది శాతం మండల పరిషత్​లకు, ఐదు శాతం జిల్లా పరిషత్​లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.

దేశంలోనే మొదటిస్థానం

గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దన్న సీఎం... కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని, ఎలాంటి రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఉపాధిహమీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్న ముఖ్యమంత్రి... 2020-21 సంవత్సరంలో 13 కోట్ల పనిదినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 75 శాతానికి పైగా 9.81 కోట్ల పనిదినాలను పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించ్చినట్లు తెలిపారు.

ఎర్రబెల్లి, అధికారులు, కలెక్టర్లకు అభినందన

సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లను అభినందించారు. ఉపాధిహామీ పథకాన్ని మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలన్న సీఎం... కూలీలకు ఎక్కువ పని కల్పించేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే పనులు జరిగేలా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. నర్సరీలు, మొక్కల పెంపకం పనులు, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు పనులు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు పనులు, కాల్వల మరమ్మత్తులు, పూడికతీత పనులు, వైకుంఠధామాల నిర్మాణం, డంపుయార్డుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు పనులు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూమిని చదును చేసుకునే పనులు, పంటపొలాల్లోకి పశువులు రాకుండా ట్రెంచ్ నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, గొర్రెల, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్ల నిర్మాణం, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను నరేగా ద్వారా చేపట్టాలని తెలిపారు.

నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్​

రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో వెయ్యి చొప్పున లక్ష కల్లాలను రూ.750 కోట్ల వ్యయంతో ఈ ఏడాది నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తామన్న సీఎం... ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందని చెప్పారు. ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్​ను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కూలీలకు చాలా తొందరగా డబ్బులు వచ్చేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు.

అందరికీ రైతుబంధు

కరోనా, లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో వెంటనే రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించామని... ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకుని అందేలా చూడాలని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించిందని... వర్షాకాలం తరహాలోనే యాసంగిలో కూడా నియంత్రిత విధానంలో ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి సాగు చేయించాలని సీఎం చెప్పారు.

ఐదువేల నగదు ప్రోత్సాహం

రైతువేదికలు నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి కావాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పోలీసుల సహకారంతో వారిని పట్టుకొని పీడీచట్టం కింద కేసులు నమోదు చేయాలని తెలిపారు. రైతు హంతకులైన నకిలీవిత్తన వ్యాపారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని... రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ, కల్తీ విత్తనాల దందా ఆగిపోవాలని సీఎం స్పష్టం చేశారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి సమాచారం ఇచ్చిన వారికి ఐదువేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​ల ఏర్పాటు

సాగునీటి వసతి పెరగడం వల్ల పంటల దిగుబడి పెరుగుతోందన్న ముఖ్యమంత్రి... పండిన ధాన్యమంతా బియ్యంగా మారేందుకు అవసరమైన మిల్లింగ్ సామర్థ్యం పెరగాలని పప్పులు, నూనెలు, పిండి తయారీకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సెజ్​లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గృహాల నిర్మాణం కోసం లేఅవుట్లకు అనుమతి ఇవ్వవద్దదని స్పష్టం చేశారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, ఆదిలాబాద్ ప్రాజెక్టులతో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సౌకర్యం పెరుగుతుందని సీఎం అన్నారు. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ నెట్ వర్క్ మ్యాపింగ్ చేయాలని.. ఆ వివరాలన్నీ జిల్లాల వారీగా కలెక్టర్ల వద్ద ఉండాలని చెప్పారు. చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తీసుకెళ్లే అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు.

రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలు, కూలీలు కరోనా నేపథ్యంలో తమ స్వస్థలాలైన బీహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లారని... మళ్లీ వారు పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. మిల్లుల యజమానులు వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారని, ఈ విషయంలో కలెక్టర్లు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.

ఇవీ చూడండి: తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్

Last Updated : Jun 17, 2020, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.