ETV Bharat / state

'భారత్‌కు కరోనా భయం లేదు' - CORONA VIRUS లాైే

కరోనా వైరస్​ సోకుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసున్నామని పేర్కొన్నారు.

KISHAN REDDY
'కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం'
author img

By

Published : Feb 9, 2020, 6:05 AM IST

Updated : Feb 9, 2020, 8:13 AM IST

'కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకూ దేశంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలుకూడా చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చైనాలో కరోనా వైరస్‌ ప్రబలిన నేపథ్యంలో భారత్‌లో పరిస్థితులను సమీక్షించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి మోదీ ఏర్పాటుచేసిన మంత్రుల టాస్క్‌ఫోర్సులº సభ్యుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి తాజా స్థితిగతులపై ‘ఈటీవీ భారత్​’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

1. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు?

మన దేశం నుంచి వేలాదిమంది వ్యాపారులు రోజూ చైనాకు వెళ్లివస్తుంటారు. వైద్యవిద్య కోసం వెళ్లిన ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం భారతీయ రాయబార కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. సరిహద్దు దేశమైన భారత్‌ మరింత జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మంత్రులు, అధికారులతో వేర్వేరు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేశారు. అధికారుల టాస్క్‌ఫోర్స్‌ రోజూ కలుస్తోంది. మంత్రులు అవసరమైనప్పుడల్లా కలుస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులు, అధికారులతో చర్చించి అక్కడ ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ విశ్లేషిస్తున్నాం. ఏం చేయాలో చెబుతున్నాం.

2. చైనా నుంచి వచ్చిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం?

చైనా నుంచి మనవాళ్లు ఇప్పటికి వెయ్యి మందికిపైగా వచ్చారు. వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన పర్యవేక్షణ కేంద్రాల్లోనే ఉంచి పరీక్షించాలని చెప్పాం. రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల పనితీరు, సౌకర్యాలు, మందుల లభ్యతను పరిశీలించడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకూ అధికారులను పంపింది. కరోనా వైరస్‌ నివారణకు మన భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో ఏమైనా ఉందేమో కనుక్కోమని ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌కు సూచించాం. విషజ్వరాలు వచ్చినప్పుడు మన ఆయుర్వేద, హోమియోపతిల్లో చాలా రకాల మందులు వాడుతున్నారు. వాటి ఆధారంగా కొన్ని మందులను గుర్తించారు.

3. మంత్రుల టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటివరకూ ఏం చేసింది?

ఇప్పటివరకూ రెండుసార్లు సమావేశమైంది. చైనాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఏ మందులు వాడుతున్నారన్న దానిపై విభిన్న దేశాలను అడిగి తెలుసుకుంటోంది. ఏ దేశంలో మందులు అందుబాటులో ఉన్నా తెప్పించుకోవాలని నిర్ణయించింది.

4. కరోనా వైరస్‌ నిర్ధారణ ఎలా జరుగుతోంది?

కరోనా వైరస్‌ గుర్తింపే అసలు సమస్య. ఈ వైరస్‌ను గుర్తించేందుకు అనువైన కొలమానం మన దగ్గర ఇంతవరకూ లేదు. అందుకే ఆ విషయాన్ని చైనానే అడిగి తెలుసుకున్నాం. హాంకాంగ్‌లో జరుగుతున్న పరీక్షలతో దాన్ని పోల్చుకొని ఆ వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపించి దేన్ని కరోనా వైరస్‌గా గుర్తించాలో స్పష్టంగా చెప్పాం.

5. అనుమానితులను ఒకే గదిలో ఉంచడం మంచిది కాదు కదా?

అనుమానితులను మాత్రమే సామూహిక సెంటర్లలో పెడుతున్నాం. నిర్ధారణ అయితే వెంటనే ఒంటరిగా ఉంచుతున్నాం. ఒక్కో విమానంలో 300 మంది వచ్చినప్పుడు అందరికీ వేర్వేరుగా 300 గదులు ఏర్పాటుచేయడం సాధ్యంకాదు.

6. ఈ వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

ఈ విపత్తు తలెత్తి వారం-పదిరోజులే అయింది. దీనివల్ల ఎంతో కొంత నష్టం ఉంటుంది. దీన్నికూడా ప్రకృతి వైపరీత్యంగానే భావించాలి. చైనా నుంచి వచ్చే బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతులను తాత్కాలికంగా నిలిపేశాం.

7. పరిస్థితి ఊహించినదానికంటే ప్రమాదకరంగా ఉందా?

చైనాలో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మనదేశంలో మాత్రం ప్రజలు చాలా ధైర్యంగా ఉన్నారు. మనకు చైనా సరిహద్దు దేశమైనా మనకు సంబంధించినంత వరకు భయపడేంత పరిస్థితి లేదు.

8. చైనా నుంచి తరలించాల్సిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారు?

వుహాన్‌ ప్రాంతంలో మన విద్యార్థులు చాలా కాలేజీల్లో చదువుకుంటున్నారు. రావడానికి ఇష్టపడని వారిని బలవంతంగా ఖాళీ చేయించలేం. చైనాలో విద్యార్థి హాస్టళ్ల నిర్వహణను భారతీయులే చూసుకుంటున్నారు. అందువల్ల ఎవరైనా రావాలనుకుంటే రావొచ్చని సమాచారం ఇచ్చాం. వారు ఎప్పుడంటే అప్పుడు అందర్నీ తరలించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

9. మేం పిశాచంతో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు అన్నారు? అంత భయానక స్థితి ఉందా?

ఇతరత్రా కారణాల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ బయట జరుగుతున్న ప్రచారాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు. ఇప్పటివరకూ భారత్‌లో ఎవ్వరూ చనిపోలేదు. పాజిటివ్‌ కేసులు కేరళలో రెండుమూడు కనిపించాయి తప్పితే ఇంక ఎక్కడా లేవు. అమెరికా చైనాకు విమానాల రాకపోకలను బంద్‌ చేసింది. విదేశాలు అనుసరించే మంచి సంప్రదాయాలను మనం కూడా అనుసరించాలని విదేశాంగ, వైద్య, పౌరవిమానయానశాఖలకు సూచించాం.

Last Updated : Feb 9, 2020, 8:13 AM IST

For All Latest Updates

TAGGED:

CORONA VIRUS
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.