ETV Bharat / state

పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్న బీఆర్​ఎస్​ ఈ ప్లాన్​ చూస్తే హ్యాట్రిక్​ కొట్టేలాగే కనిపిస్తుందిగా - బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

BRS Party Assembly Elections Strategy 2023 : మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి.. పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హోరెత్తించిన మంత్రులు.. పార్టీ కార్యక్రమాలలోనూ దూకుడు పెంచారు. ఒకేసారి 115 మంది అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల ప్రకటించిన కేసీఆర్‌.. వెంటనే ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెబుతూనే.. కాంగ్రెస్‌ అధికారంలో వస్తే.. అన్ని అనర్ధాలే జరుగుతాయంటూ.. ప్రజలకు వివరిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు కూడా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని పదునెక్కిస్తున్నారు.

BRS War Room Arrangements in Telangana
BRS Party Election Strategy 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 6:44 AM IST

హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా రాష్ట్రంలో గులాబీ గుబాళింపు

BRS Party Assembly Elections Strategy 2023 : స్వరాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన గులాబీ పార్టీ.. హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టింది. ఎత్తులు పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. 2023 ఏడాది ప్రారంభమైన వెంటనే ఎన్నికల దిశగా.. భారత రాష్ట్ర సమితి కార్యచరణ ప్రారంభించింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలులో వేగం పెంచింది. మరోవైపు సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, సభ్యత్వ నమోదు, కమిటీల నియామకం వంటి కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతూ వచ్చారు.

2018 ఎన్నికల మాదిరిగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చిన బీఆర్ఎస్.. 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి.. గత ఎన్నికల వ్యూహాన్నే అనుసరించింది. అభ్యర్థులందరూ వెంటనే ప్రచారంలోకి దిగిపోయారు. మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు(Minister Harish Rao) సుడిగాలి పర్యటనలతో ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు. ఇద్దరూ కలిసి సుమారు 70 నియోజకవర్గాల్లో పర్యటించి.. అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభల్లో రాజకీయ ఆరోపణలు, ఎదురుదాడులతో వేడిని పెంచారు.

ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ప్రజలు మాత్రం వివేకంతో ఆలోచించి ఓటు వేయాలి సీఎం కేసీఆర్

ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే.. బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. అక్టోబరు 15న గులాబీ దళపతి కేసీఆర్.. మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి.. ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్ హుస్నాబాద్‌లో ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. దసరా అనంతరం రోజూ మూడు సభలలో పాల్గొంటున్నారు. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సభలకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. మరోవైపు.. కేటీఆర్(Minister KTR), హరీశ్‌రావు సైతం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ.. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

BRS Party Election Campaign : ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే.. చేరికలపైనా గులాబీ పార్టీ దృష్టి పెట్టింది. టిక్కెట్‌ దక్కలేదనే అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడితే.. ఇందుకు కౌంటర్‌గా ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతల్ని ఆకర్షిస్తోంది. రోజుకు ఒకరిద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంటూ.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతోంది. పలు నియోజకవర్గాల్లో భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. కొందరు నేతలకు పదవులను కట్టబెట్టి బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగించింది. అయినప్పటికీ మరికొందరు నేతలు పార్టీ వీడటం జరిగింది.

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

అందులో పలువురు ప్రముఖ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నర్సింహులు, మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన పూర్తయితే... మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.

BRS Manifesto For Telangana Election 2023 : కేసీఆర్ భరోసా పేరుతో.. ఎన్నికల మేనిఫెస్టోను గులాబీ శ్రేణులు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. ఈసారి కొత్తగా కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికీ ధీమా అనే కొత్త పథకం ప్రవేశపెడతామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రూ.5లక్షల బీమా ప్రయోజనం కలుగుతుందని వివరిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో(BRS Manifesto) ప్రకటించారు.

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

నాలుగు వందల రూపాయలకే సిలిండర్, పేద మహిళలకు 3వేల రూపాయల భృతి.. దశలవారీ పెన్షన్​ల పెంపు వంటి ఎన్నో హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలు.. ఓటర్లను ఆకర్షిస్తాయన్న ధీమా బీఆర్ఎస్​లో కనిపిస్తోంది. రైతుబంధు దశల వారీగా 16వేలకు, ఆరోగ్యశ్రీ(Arogya sri Scheme) గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్‌లో మరో లక్ష డబల్ బెడ్ రూంల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్‌మెంట్‌ భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రకులాల పేదలకూ గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సీపీఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటివి.. కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రచారం చేస్తోంది.

BRS War Room Arrangements in Telangana : ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న బీఆర్ఎస్... కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నియోజకవర్గానికి ఒక వార్‌ రూమ్‌తో పాటు రాష్ట్రస్థాయిలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు.. ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించింది. కార్యకర్తలు, కచ్చితంగా బీఆర్ఎస్​కే ఓటు వేస్తారని భావించే వారు ఏ-కేటగిరీలో.. ఏ పార్టీకి వేయాలో తేల్చుకోలేని ఓటర్లను B- కేటగిరీగా విభజించింది.

BRS Assembly Elections Campaign 2023 : ప్రచారంలో దూసుకెళ్తోన్న బీఆర్​ఎస్​.. 24 గంటల కరెంటే ప్రధాన ఎజెండాగా జనంలోకి

C-కేటగిరీలో ఇతర పార్టీల కార్యకర్తలు, పార్టీకి ఓటు వేయరని భావించేవారిని D-కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు. నాలుగు కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి.. తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్‌ రూమ్‌లో వ్యూహరచన చేస్తున్నారు. వార్‌రూమ్‌లలో పొలిటికల్, మీడియా, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌(Crisis Management) కమిటీలను ఏర్పాటు చేసి వేర్వేరుగా బాధ్యతలు అప్పగించారు.

ఓవైపు తొమ్మిదిన్నరేళ్ల పాలన ఫలాలను వివరిస్తూ.. మరోవైపు ప్రత్యర్థులపై ప్రధానంగా కాంగ్రెస్‌పై కేసీఆర్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అభ్యర్థుల నుంచి అధినేత వరకూ... తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ ప్రసంగిస్తున్నారు. దిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ.. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. తగ్గేదే లే అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.