ETV Bharat / state

బల్దియా బాద్​షా ఎవరు..? మేయర్​ పీఠంపై అందరి దృష్టి!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియటంతో... అందరి దృష్టి మేయర్‌ ఎన్నికపై పడింది. వివిధ పార్టీలు కైవసం చేసుకున్న స్థానాలతోపాటు వారి ఎక్స్‌అఫిషియో సభ్యుల ఆధారంగా మేయర్‌ పీఠం దక్కుతుంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం పార్టీలు వ్యూహాలు రచించనున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ అఫిషియోల సంఖ్యా బలంలో తెరాస పటిష్ఠ స్థితిలో ఉంది.

author img

By

Published : Dec 2, 2020, 5:36 AM IST

Updated : Dec 2, 2020, 7:47 AM IST

GHMC MAYOR
గ్రేటర్​ మేయర్​ పీఠంపై అందరి దృష్ట!

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగియడం వల్ల ఫలితాలు, తదుపరి మేయర్‌ ఎన్నికపైనా అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం.. మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరిస్తుంది. అనంతరం మహానగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు కావటానికి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్లు నమోదైన వారి తాజా జాబితా ఆధారంగా మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికలు జరుగుతాయి.

డివిజన్ల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయా పార్టీల వ్యూహాలు ఖరారయ్యే వీలుంది. ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారం... గ్రేటర్​లో 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఇందులో తెరాసకి 31 మంది, మజ్లిస్‌ 10, భాజపాకి మూడు, కాంగ్రెస్‌కి ఒక సభ‌్యుడు ఉన్నారు. 150 మంది కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే..... అధిక సంఖ్యా బలం ఉన్న పార్టీ... జీహెచ్​ఎంసీ మేయర్‌, ఉపమేయర్‌ స్థానాలను గెలిచే వీలుంటుంది.

ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కావాలంటే..

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కావాలంటే... ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అయితే... రాజ్యసభ సభ్యుడిగా గెలిచిన కేఆర్​ సురేశ్‌ రెడ్డితోపాటు ఇటీవల గవర్నర్‌ కోటాలో కొత్తగా నియమితులైన... గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ఎక్స్‌అఫిషియోకు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హైదరాబాద్‌లో ఓటు ఉంది. ఆమె సైతం ఎక్స్‌అఫిషియోగా చేరే వీలుంది. ఈ క్రమంలో డివిజన్ల ఫలితాల అనంతరం తెరాస తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎవరికెన్ని సీట్లు కావాలి..

మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే ఎక్స్‌ అఫిషియోలు కలుపుకొని పార్టీలు కొన్ని స్థానాలు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. తెరాసకు ప్రస్తుతం 31 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల బలం ఉండగా... ఇంకా 67 స్థానాలు గెలుపొందాలి. మజ్లిస్‌ పార్టీకి 10 మంది ఉన్నందునా... 88 డివిజన్లు దక్కాలి. భాజపాకు ముగ్గురు ఎక్స్‌అఫిషియో ఉన్న కారణంగా... ఇంకా 95 స్థానాలు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు ఒక్క సభ్యుడు ఉన్నకారణంగా 97 డివిజన్లలో గెలుపొందాల్సి ఉంటుంది.

ఇవీచూడండి: బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?

Last Updated : Dec 2, 2020, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.