India New Zealand Cricket Match: నాగోల్-రాయదుర్గం మార్గంలో ఇవాళ ఎక్కువ మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌కు భారీగా అభిమానులు రానున్న దృష్ట్యా రద్దీని తట్టుకునేందుకు మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లు తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. రద్దీ మేరకు రైళ్లు నడపడానికి నాగోల్‌లో స్టాండ్‌బైగా 2 మెట్రో రైళ్లను ఉంచనున్నారు. నాగోల్, ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ మెట్రోస్టేషన్‌లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: