ETV Bharat / state

'సారూ... నా భర్త నుంచి నన్ను, నా పిల్లల్ని కాపాడండి'

​​​​​​​కట్టుకున్నవాడి నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. భర్త లక్ష్మయ్యపై కమిషన్​ ఛైర్మన్​కు ఫిర్యాదు చేసింది.

a women complained to state human commission on her husband who harasses her for money
'సారూ... నా భర్త నుంచి నన్ను, పిల్లల్ని కాపాడండి'
author img

By

Published : Jan 18, 2020, 10:33 AM IST

'సారూ... నా భర్త నుంచి నన్ను, పిల్లల్ని కాపాడండి'

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం ఎల్గోమ్ముల గ్రామానికి చెందిన మంజులకు కొత్తపేటకు చెందిన లక్ష్మయ్యతో 2005లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వచ్చి కూలి పనులు చేస్తూ ఈ దంపతులు జీవనం సాగిస్తున్నారు.

మద్యానికి బానిసై తన భర్త పని చేసే చోట రూ.2 లక్షలు అప్పు చేశాడని, అవి చెల్లించేందుకు తన పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని వేధిస్తున్నాడని తెలిపింది. డబ్బు కోసం అతని స్నేహితుడి వద్దకు పంపేందుకు బలవంతం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతని నుంచి తప్పించుకుని మూణ్నెళ్ల క్రితం తన ముగ్గురు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్లానని చెప్పింది.

ఈ నెల 14న సంక్రాంతి పండుగ రోజు ఇంటికి వచ్చి దాడి చేసి బలవంతంగా తనను, పిల్లలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని మిడ్జిల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు లక్ష్మయ్యపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త.. తనను చంపి మరో పెళ్లి చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకు, పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించి, మిడ్జిల్​ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంజుల రాష్ట్ర కమిషన్​ను వేడుకుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.