ETV Bharat / state

చంపింది మద్యమా.. ప్రియురాలా..? - హోటల్​ మేనేజర్​ అనుమానస్పద మృతి

కొండాపూర్​లోని ఓయో రూమ్​లో నిన్న ఓ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోయాడు. అంతుకుమందు రోజు మృతుడు తన ప్రియురాలితో కలిసి వచ్చాడని హోటల్​ సిబ్బంది తెలిపారు.

చంపింది మద్యమా.. ప్రియురాలా..?
చంపింది మద్యమా.. ప్రియురాలా..?
author img

By

Published : Jan 18, 2020, 6:08 AM IST

చంపింది మద్యమా.. ప్రియురాలా..?
హైదరాబాద్​ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూమ్​లో బోరబండకు చెందిన రత్న వర ప్రసాద్ రావు (22) అనే వ్యక్తి నిన్న అనుమనదాస్పదంగా మృతి చెందాడు. మృతుడు హైటెక్ సిటీలోని ఓ హొటల్​లో మేనేజర్​గా పని చేస్తున్నాడు. తన ప్రియురాలితో మొన్న కొండాపూర్​లోని ఓయో రూమ్​కి ప్రసాద్ రావు వచ్చాడని హోటల్​ సిబ్బంది తెలిపారు.

అతిగా మద్యం సేవించనందుకేనా..!

శుక్రవారం ఉదయం వర ప్రసాద్​ తన రూమ్​లో అనుమానాస్పదంగా పడివుండటం వల్ల హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతిగా మద్యం సేవించినందునే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:నీటి గుంటలో పడి బాలుడు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.