రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,03,398 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 808 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,27,498కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ఏడుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,698కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,061 మంది కోలుకోవడం ద్వారా కోలుకున్న వారి సంఖ్య 6,12,096కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: Bank loans: వారి పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం ఫోన్లకు రుణాలు