సినిమా అభిమానం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఆరుగు ఎస్సైల ఉద్యోగం మీదకు తెచ్చింది. ఇవాళ విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై... కర్నూలు జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఆరుగురు ఎస్సైలు కోవెలకుంట్లలోని.... సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా చూస్తుండగానే ఉన్నతాధికారులకు సమాచారం అందింది. గాంధీ జయంతి, కొత్త గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభోత్సవాల వంటి కీలక కార్యక్రమాల బందోబస్తును వదిలేసి... సమాచారం ఇవ్వకుండా సినిమాకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప.... ఆరుగురిని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: రివ్యూ: మెగాస్టార్ అయ్యారు 'సైరా'