ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయంలో డీఎఫ్వో ప్రభాకర్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో బిల్వపత్రం మొక్కలను నాటారు.
ఆరో విడత హరితహారం నూతన అధ్యాయంగా మారనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు.