ఆదిలాబాద్ జిల్లాలోని పలు గిరిజన మండలాల్లో కేంద్రమంత్రిత్వ శాఖ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఉట్నూర్ మండల కేంద్రంలోని పల్లీపట్టీల కేంద్రాన్ని సందర్శించి...వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో యువత జీవనోపాధికోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవోతో కలిసి సందర్శించారు.
నార్నూర్, గాదిగూడెం మండలాల్లో పర్యటించి ఆదివాసీల జీవనవిధానాలపై ఆరా తీశారు. వారి సంస్కృతి, సంప్రదాయాలపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దీల్లీ బృంద సభ్యులు ఏపీసీ అర్బన్ కుమార్, విఘ్నేశ్వర పాల్గొన్నారు.