ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడాన్ని హర్షిస్తూ ఆదిలాబాద్‌లో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం దీపాలు వెలిగించారు. మోదీ ఛరిష్మాతోనే ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చిందని నేతలు కొనియాడారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, రాజ్యసభ హిందీ భాషా కమిటీ సభ్యురాలు సుహాసినిరెడ్డి సంబురాల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రజలకు ధన్యవాదాలు: కావ్యా కిషన్ రెడ్డి