ETV Bharat / sports

కెనిన్ జోరు.. క్విటోవా, జకో ముందుకు - ఫ్రెంచ్ ఓపెన్ రిజల్డ్స్

పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్​లో సత్తా చాటిన కెనిన్.. ప్రిక్వార్టర్స్​లో అడుగుపెట్టింది. క్విటోవా, జకోవిచ్.. ముందంజ వేశారు.

french open latest results NEWS
కెనిన్ జోరు.. క్విటోవా, జకో ముందుకు
author img

By

Published : Oct 4, 2020, 6:37 AM IST

అమెరికా యువ తార సోఫియా కెనిన్‌ సత్తా చాటింది. ఫ్రెంచ్ ఓపెన్​లో జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శనివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో కెనిన్‌.. 6-2, 6-0తో క్వాలిఫయర్‌ ఇరినా బారా (రొమేనియా)ను చిత్తు చేసింది.

గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన కెనిన్‌.. ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌ చేరింది. చెక్‌ అమ్మాయి క్విటోవా కూడా ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఏడో సీడ్‌ 7-5, 6-3తో లెలా ఫెర్నాండెజ్‌ (కెనడా)ను ఓడించింది. మరోవైపు ఎనిమిదో సీడ్‌ సబలెంక మూడో రౌండ్లోనే ఓడింది. పోటాపోటీగా సాగిన సమరంలో €6-7 (7-9), 6-2, 3-6తో ఆన్స్‌ జబెర్‌ (ట్యూనీసియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌ చేరడం జబెర్​కు ఇదే తొలిసారి. లాత్వియా స్టార్‌ ఒస్టాపెంకో 4-6, 3-6తో బడోసా (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది.

మిగిలిన మ్యాచ్‌ల్లో సిగ్మండ్‌ (జర్మనీ) 6-7 (5-7), 6-3, 6-0తో 13వ సీడ్‌ మార్టిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను ఇంటిముఖం పట్టించగా.. జంగ్‌ (చైనా) 7-6 (7-2), 7-5తో బరెల్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గింది.

tennis kvitova
పెట్రా క్విటోవా

బెరిటిని ఔట్‌:

పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ బెరిటిని (ఇటలీ) ఓడిపోయాడు. మూడో రౌండ్లో అతడు 2-6, 6-7 (5-7), 4-6తో క్వాలిఫయర్‌ అల్ట్‌మయిర్‌ చేతిలో కంగుతిన్నాడు. జకోవిచ్‌ 6-0, 6-3, 6-2తో గాలన్‌ (కొలంబియా)ను ఓడించాడు. మరో పోరులో అండర్సన్‌ 3-6, 2-6, 3-6తో రుబ్‌లెవ్‌ (రష్యా) చేతిలో ఓడగా, గ్రీస్‌ కుర్రాడు సిట్సిపాస్‌ 6-1, 6-2, 3-1తో బెడెన్‌ (స్లొవేనియా)పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పోరు నుంచి తప్పుకోవడం వల్ల ముందంజ వేశాడు. దిమిత్రోవ్‌ (బËల్గేరియా) 6-1, 6-3తో కార్‌బాలెస్‌ (స్పెయిన్‌)పై పైచేయిగా ఉన్న దశలో కార్‌బాలెస్‌ గాయంతో వైదొలగడం వల్ల విజయాన్ని అందుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.