ETV Bharat / sports

తెలుగమ్మాయి కోనేరు హంపికి మళ్లీ నిరాశ - కోనేరు హంపికి మళ్లీ నిరాశ

World Blitz Tournament: తెలుగమ్మాయి కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ టోర్నమెంట్​లోనూ నిరాశపర్చింది. ఆఖరి రౌండ్‌ ఆరంభానికి ముందు రెండో స్థానంలో ఉన్న హంపి.. చివరి రౌండ్లో పరాజయంపాలై పతకానికి దూరమైంది. ఈ టోర్నీని హంపి ఐదో స్థానంతో ముగించింది.

koneru humpy World Blitz Tournament, ప్రపంచ బ్లిట్జ్ టోర్నమెంట్ కోనేరు హంపి
koneru humpy
author img

By

Published : Dec 31, 2021, 6:45 AM IST

World Blitz Tournament: తెలుగమ్మాయి కోనేరు హంపికి నిరాశ..! ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగి పతకం గెలవడంలో విఫలమైన ఆమె.. బ్లిట్జ్‌ విభాగంలో కొద్దిలో పతకం చేజార్చుకుంది. ఆఖరి రౌండ్‌ ఆరంభానికి ముందు రెండో స్థానంలో ఉన్న హంపి.. చివరి రౌండ్లో పరాజయంపాలై పతకానికి దూరమైంది. ఈ టోర్నీని హంపి ఐదో స్థానంతో ముగించింది.

తొమ్మిది రౌండ్లలో 7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఆశలు రేపిన హంపి.. గురువారం, పోటీల చివరిరోజు తడబడింది. పదో రౌండ్లో కొస్తెనిక్‌ (రష్యా)పై గెలిచి.. పదకొండో రౌండ్లో బిబిసారా (కజకిస్థాన్‌) చేతిలో ఓడిన హంపి.. పన్నెండో రౌండ్లో అలీనా (రష్యా)ను ఓడించి మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే 13వ రౌండ్లో వాలంటీనా (రష్యా) చేతిలో ఓటమి పాలైన ఆమె... 14వ రౌండ్లో వైశాలిపై గెలిచి.. 15వ రౌండ్లో జాన్‌సయా (కజకిస్థాన్‌)తో డ్రా చేసుకుని పుంజుకుంది. 16వ రౌండ్లో కేథరినా (రష్యా)ను ఓడించి పతకం ముంగిట నిలిచిన హంపి.. కచ్చితంగా గెలవాల్సిన ఆఖరి రౌండ్లో (17వ) పొలీనా (రష్యా) చేతిలో పరాజయం చవిచూసింది.

వైశాలి పద్నాలుగో స్థానంలో నిలిచింది. ర్యాపిడ్‌లో హంపి ఆరో స్థానంతో ముగించింది. పురుషుల బ్లిట్జ్‌ విభాగంలో అర్జున్‌ ఇరిగైసి 24వ స్థానంలో నిలవగా, భారత ఆటగాళ్లలో ఉత్తమంగా విదిత్‌ గుజరాతి 18వ ర్యాంకు సాధించాడు.

ఇవీ చూడండి: 29 ఏళ్లకే స్టార్​ క్రికెటర్​ రిటైర్మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.