ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికీ 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకుంది భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్. కజకిస్థాన్ వేదికగా కాంస్యం కోసం జరిగిన పోరులో అమెరికా క్రీడాకారిణి సారా హిల్డేబ్రాండ్పై నెగ్గింది.
సారాపై 8-2 పాయింట్ల తేడాతో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది వినేశ్. ఈ రోజు సాయంత్రం జర్మనీ ప్లేయర్ మారియాతో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఇందులో నెగ్గితే కాంస్యాన్ని పక్కా చేసుకుంటుంది.
మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ... రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ముకైదా(జపాన్) చేతిలో 0-7 తేడాతో పరాజయం చెందింది ఫొగాట్. ఫలితంగా స్వర్ణం ఆశలపై నీళ్లు చల్లుకుంది.
ఇదీ చదవండి: 2022 వింటర్ ఒలింపిక్స్ మస్కట్స్ ఆవిష్కరణ