ETV Bharat / sports

పారాలింపిక్స్​కు అంతా సిద్ధం.. భారత అథ్లెట్లూ రెడీ

టోక్యో ఒలింపిక్స్​లో గతంకన్నా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. పారాలింపిక్స్​కు సిద్ధమైంది. మంగళవారమే టోర్నీ ఆరంభంకానుంది.

Tokyo Paralympics
పారాలింపిక్స్
author img

By

Published : Aug 23, 2021, 8:54 PM IST

మంగళవారం (ఆగస్టు 24) నుంచి టోక్యో పారాలింపిక్స్​ క్రీడలు ప్రారంభంకానున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 54 మంది అథ్లెట్లను బరిలో దింపుతోంది భారత్. ఆర్చరీ, అథ్లెటిక్స్​, వెయిట్​లిఫ్టింగ్​ ఇలా మొత్తం 9 క్రీడల్లో ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టార్గెట్​ ఒలింపిక్​ పోడియమ్​ స్కీమ్​లో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

Tokyo Paralympics
పారాలింపిక్స్​ కోసం టోక్యో వెళ్తున్న భారత బృందం

రియో ఒలింపిక్స్​లో పసిడి పతకాలు గెలిచిన మరియప్పన్, దేవేంద్రతో పాటు తమ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించిన సందీప్ చౌదరి, సుమిత్ లాంటి వాళ్లు ఈ క్రీడలకు వెళ్తున్నారు.

పతకాలు వచ్చే ఛాన్స్​ ఎక్కువే..

పారాలింపిక్స్​లో ఎఫ్​-52 కేటగిరీలో బరిలోకి దిగిన డిస్కస్​ త్రో అథ్లెట్​ వినోద్​ కుమార్​.. అదే కేటగిరీలో కొనసాగనున్నాడు. దీనిపై పారా అథ్లెటిక్స్​ ఛైర్​పర్సన్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్-​52లో కొనసాగడం వల్ల పతకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే, జావెలిన్​ త్రో అథ్లెట్ తేక్​చాంద్​..​ ఎఫ్-​54 కేటగిరీ నుంచి ఎఫ్-55కు రీక్లాసిఫై అయ్యాడు. కేటగిరీ మారడం వల్ల తేక్​చాంద్​కు పోటీ కష్టతరం అవుతుందని పారా అథ్లెటిక్స్​ ఛైర్​పర్సన్​ అభిప్రాయపడ్డారు. కానీ తేక్​చాంద్​ మెరుగైన ప్రదర్శనే చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

అసలు ఏంటీ కేటగిరీలు?

పారాలింపిక్స్​లో ఆటగాడి వైకల్యం, సామర్థ్యానికి సమఉజ్జీవులుగా ఉన్న వారితోనే పోటీ నిర్వహించేందుకు ఈ కేటగిరీ పద్ధతిని ఏర్పాటు చేశారు. ట్రాక్​, మారథాన్​, జంపింగ్​కు సంబంధించిన క్రీడలను 'టీ' కేటగిరీగా గుర్తిస్తారు. ఫీల్డ్​కు సంబంధించిన క్రీడలకు 'ఎఫ్​' కేటగిరీగా గుర్తిస్తారు. సాధారణంగా కేటగిరీ సంఖ్య ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ వైకల్యం ఉన్నట్టు పరిగణిస్తారు.

అథ్లెట్లకు మొత్తం టీ/ఎఫ్​ 51, టీ/ఎఫ్​ 52, టీ/ఎఫ్​ 53, టీ/ఎఫ్​54, టీ/ఎఫ్​55, టీ/ఎఫ్​ 57 కేటగిరీలు ఉంటాయి.

ఇదీ చదవండి : Paralympics: వైకల్యాన్ని జయించి.. విశ్వ క్రీడలకు కదిలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.