Thailand Open: ప్రపంచ ఛాంపియన్షిప్స్లో రెండు సార్లు పతకాలు సాధించిన జోసీ గబుకోకు షాక్ ఇచ్చింది భారత బాక్సర్ మోనిక. దీంతో థాయ్లాండ్ ఓపెన్ 2022లో మహిళల 48 కేజీల విభాగంలో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో 4-1 తేడాతో అనుభవజ్ఞురాలైన గబుకోపై అద్భుత విజయం సాధించింది 26 ఏళ్ల మోనిక.
సెమీస్లో వియత్నాంకు చెందిన ట్రాన్ థి దియేమ్తో తలపడనుంది హరియాణాకు చెందిన మోనిక. భారత్కు చెందిన ఆశిష్ కుమార్, మనీషా కూడా ఆమెతో పాటుగా ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు.
ఇదీ చూడండి: ఈ కిక్బాక్సర్ పంచ్లకే కాదు.. పరువాలకూ పతకాలివ్వాలేమో!