భారత చదరగంగం క్రీడాకారిణి కోనేరు హంపి తాజా ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్(ఫిడె) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన ఈ తెలుగు తేజం... ఇటీవల రష్యాలో జరిగిన ఫిడె గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి 2,577 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
2017లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కోనేరు హంపి రెండేళ్లు ఆటకు దూరంగా ఉంది. ఇప్పటివరకు ఈ క్రీడాకారిణి... ఫిడె ప్రపంచ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఏడు టైటిళ్లు గెలిచింది.
చైనా క్రీడాకారిణి హోయు యిఫాన్ 2,659 పాంయిట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశానికే చెంది జు వెన్జున్ 2,586 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఓపెన్ విభాగంలో భారత చెస్ స్టార్ విశ్వనాథ్ ఆనంద్ 2,765 పాయింట్లతో 9వ స్థానంలో ఉండగా.. నార్వే చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్ 2,876 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి: విశాఖలో మయాంక్ అగర్వాల్ 'డబుల్' ధమాకా