Wriddhiman saha: టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. సరికొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. భారత జట్టుకు దూరమైన అతడు.. దేశవాళీలో బెంగాల్ జట్టు నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఇప్పుడతడు.. త్రిపుర తరపున ఆడడం సహా ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. క్యాబ్ ప్రతినిధులతో విభేదాల కారణంగా అతడు బెంగాల్‌కు గుడ్‌బై చెప్పాడు.
టీమ్‌ఇండియాకు దూరమైన సాహా అంకితభావాన్ని క్యాబ్ సంయుక్త కార్యదర్శి దెబబ్రత దాస్ ప్రశ్నించాడు. దీంతో ఈ సీజన్ రంజీ గ్రూప్ మ్యాచ్‌ల్లో సాహా బరిలో దిగలేదు. తనను సంప్రదించకుండానే క్వార్టర్స్ పోరుకు అతన్ని జట్టులోకి ఎంపిక చేశారు. కానీ దెబబ్రత తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సాహా బెంగాల్‌ను వీడాడు. 37 ఏళ్ల అతడు ఈ ఏడాది టీ20 లీగ్‌లో గొప్ప ప్రదర్శనతో గుజరాత్ టైటిల్ నెగ్గడంలో కీలకంగా వ్యవహరించాడు. 2007లో బెంగాల్ తరపున అరంగేట్రం చేసిన అతను 122 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడాడు.
ఇదీ చూడండి: 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రవిడ్ ఏం అన్నాడంటే?