ETV Bharat / sports

WPL 2023: దంచేసిన ముంబయి.. కుప్పకూలిన గుజరాత్​ - మహిళల ప్రీమియర్​ లీగ్​ గుజరాత్

మహిళల ప్రీమియర్​ లీగ్​ ఆరంభ మ్యాచ్​లో ముంబయి చెలరేగి ఆడింది. ఆ జట్టు విజృంభించడంతో గుజరాత్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఆ మ్యాచ్ వివరాలు..

wpl 2023 mumbai indians gujarat giants first match winner

author img

By

Published : Mar 4, 2023, 11:04 PM IST

Updated : Mar 5, 2023, 6:22 AM IST

డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌ ఆరంభం అదిరింది. పరుగుల వరద పారింది. దీంతో పాటే వికెట్ల మోత కూడా మోగింది. అయితే ఇదంతా చేసింది ముంబయి ఇండియన్సే. మెన్స్​ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీమ్​గా ఉన్న ముంబయి.. మహిళల లీగ్‌ ఆరంభ మ్యాచ్​లోనూ తన ఆధిపత్యాన్ని చూపించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన.. బెత్‌ మూనీ కెప్టెన్సీలోని గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించేసింది. మొదట హర్మన్‌ (65;), హేలీ మాథ్యూస్‌ (47), అమేలియా కెర్‌ (45*) విజృంభించడంతో ముంబయి 5 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో స్నేహ్‌ రాణా (2/43) పర్వాలేదనిపించింది. అనంతరం సైకా ఇషాక్‌ (4/11), నాట్‌ సీవర్‌ (2/5), అమేలియా కెర్‌ (2/12) రాణించడంతో గుజరాత్‌ 15.1 ఓవర్లలో ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. హేమలత(27) టాప్‌ స్కోరర్‌. హర్మన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచింది.

అయితే ఈ మ్యాచ్ చూసిన వారు.. 2008 తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్​ను గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు కోలక్​తా, బెంగళూరు మధ్య ఫస్ట్​ మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 73 బంతుల్లోనే 158 రన్స్​తో చెలరేగిపోయాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ 82 పరగులకే ఆలౌటై 140 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని అందుకుంది. అజిత్‌ అగార్కర్‌ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ఇప్పుడదే సీన్​ రిపీట్‌ అయిందంటూ క్రికెట్​ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

పోటీయే లేదు: హర్మన్‌ప్రీత్‌, అమేలియా కెర్‌, నాట్‌ సీవర్‌, హేలీ మాథ్యూస్‌ లాంటి టాప్​ ప్లేయర్స్​తో ముంబయి బలంగా కనిపించగా.. ఆష్లీ గార్డ్‌నర్‌, బెత్‌ మూనీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఉన్న గుజరాత్‌.. ముంబయికి జట్టుకు దీటుగా నిలుస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. ముంబయి టీమ్​కు.. గుజరాత్‌ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేక చతికిల పడింది. మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌.. ప్రారంభంలోనే యాస్తిక (1) వికెట్‌ పడగొట్టి జోష్​తో ముందుకెళ్లింది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ముందుగా హేలీ మాథ్యూస్‌, నాట్‌ సీవర్‌ బాగా ఆడగా.. ఆ తర్వాత హర్మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. 12 ఓవర్లకే ఆ జట్టు స్కోరు 100కు చేరుకుంది. అందులోనూ హర్మన్‌ కేవలం 22 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేసి ఆకట్టుకుంది. 17వ ఓవర్లో ఆమె పెవిలియన్​ చేరేసరికి స్కోరు 166. చివరి ఓవర్లలో అమేలియా, పూజ (15) కూడా బాగానే రాణించడంతో స్కోరు 200 దాటిపోయింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌.. ముంబయి బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్​ చేయలేక చతికిల పడింది. నాట్‌ సీవర్‌, ఇసీ వాంగ్‌ (1/7)ల దెబ్బకు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా ముందుకెళ్లింది. మధ్య ఓవర్లలో సైకా ఇషాక్‌ బాగా రాణించడంతో గుజరాత్​కు కష్టాలు ఇంకా పెరిగాయి. 23/7కు చేరుకున్న ఆ టీమ్​ కనీసం 50 స్కోరైనా చేస్తుందా అనిపించింది. అయితే హేమలత కాస్త మంచి ఇన్నింగ్స్​ ఆడి జట్టు పరువును కాపాడింది. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్‌ బెత్‌ మూనీ (0) కూడా తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 9వ వికెట్‌తోనే గుజరాత్‌ ఇన్నింగ్స్‌ క్లోజ్ అయింది.

Last Updated : Mar 5, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.