భారత్- పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుంటాయి. ఇక ఈ రెండు జట్లు క్రికెట్లో పోటీపడితే(ind pak match).. ఆశలు, ఆవేశాలు, ఉత్కంఠ.. అన్నీ వేరే లెవల్లో ఉంటాయి. ఆదివారం కూడా ఇదే జరిగింది. కానీ ఈసారి విజయం పాకిస్థాన్‌ను వరించింది. కోట్లాది మంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి(T20 world cup 2021 news).
అయితే మ్యాచ్(india vs pakistan news ) అనంతరం భారత్- పాకిస్థాన్ ఆటగాళ్లు కలిసి కొంత సమయాన్ని గడపడం 'ఆటలో గెలుపోటములు సహజం, ఏది ఎదురైనా ముందుకు సాగాల్సిందే,' అని చాటిచెప్పింది. ముఖ్యంగా టీమ్ఇండియా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. పాకిస్థాన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ దర్శనమిచ్చాడు. పాక్ ఆటతీరును మెచ్చుకుంటూ, వారికి ధోని కొన్ని సూచనలు చేసినట్టు దృశ్యాల్లో కనిపించింది. మిస్టర్ కూల్.. ఎప్పటిలాగే కూల్‌గా కనపడ్డాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ధోనితో కలిసి కొంతసేపు నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గెలుపోటములు మ్యాచ్ వరకేనని, ఆట తర్వాత అందరు ఒకటేనని ఈ దృశ్యాలు ప్రపంచానికి చాటిచెప్పాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాపై ఆది నుంచి పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. 20ఓవర్లకు భారత జట్టు 151 పరుగులు సాధించింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా ఆడిన పాక్.. 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌పై తొలి గెలుపును ఆశ్వాదించింది.
ఇదీ చదవండి: IND vs PAK: ఎంత ఎదురుచూసినా.. ఈసారి ఏ మాయ జరగలేదు!