Stuart Broad On Yuvraj Singh : ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీమ్ఇండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసుకున్నాడు. 2007 టీ 20 ప్రపంచకప్‌లో యువీ.. తన బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు బాదిన సంఘటనను బ్రాడ్ ఇప్పటికీ మర్చిపోలేదన్నాడు. అయితే ప్రస్తుతం యాషెస్ చివరి టెస్టు ఆడుతున్న బ్రాడ్.. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఓ విలేకరి.. యువీ గురించి అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు.
"యువీ నా బౌలింగ్‌లో ఆరు సిక్సులు బాదిన ఆ రోజు నా కెరీర్లోనే కఠినమైనది. నేను 2007 ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు నా వయసు బహుశా 21,22 సంవత్సరాలు. అప్పటికి నాకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఏమీ లేదు. మ్యాచ్‌కు ముందు పెద్దగా ప్రాక్టీస్ కూడా చేసేవాణ్ని కాదు. యువీకి ఆరు సిక్సులు సమర్పించుకున్నాక.. కెరీర్‌పై దృష్టి పెట్టాను. ఆ మ్యాచ్ నాకు మానసికంగా బలపడడానికి సహాయపడింది. టోర్నీలో మాకు ఆ మ్యాచ్ నామమాత్రమైనది. లేకపోతే మా జట్టు నా వల్లే ఎలిమినేట్ అయ్యిందని బాధపడేవాడిని. కానీ ఆ చేదు అనుభవమే నన్ను ఈ రోజు ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. 15 - 16 ఏళ్ల కెరీర్లో నాకు తెలిసొచ్చిందేమిటంటే.. క్రికెట్లో మంచి రోజుల కంటే చెడ్డ రోజులే ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్లు అన్నింటినీ ఎదుర్కోవాలి"
- స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ క్రికెటర్..
Stuart Broad Ben Stokes : అలాగే బ్రాడ్.. తన సహచర ఆటగాడు బెన్ స్టోక్స్ గురించి కూడా ప్రస్తావించాడు. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విండీస్ బ్యాటర్ బ్రాత్వైట్కు, స్టోక్స్ నాలుగు సిక్సులు ఇచ్చిన సంఘటనను గుర్తుచేశాడు. ఆ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ ఓడింది. కానీ ఆ తర్వాత స్టోక్స్.. తనను తాను మెరుగుపర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ విజయాల్లో, వారు 2019 వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ ఎంత కీలకం అయ్యాడో చెప్పుకొచ్చాడు.
బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు..
తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న బ్రాడ్‌కు ఇరు జట్ల నుంచి గౌరవం దక్కింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 375 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన బ్రాడ్‌కు ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. అతడు జేమ్స్ అండర్సన్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో బ్రాడ్ 8 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్టార్క్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా బ్రాడ్ సిక్సర్ బాదడంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఈ సిక్సర్‌తో బ్రాడ్.. తన బ్యాటింగ్ కెరీర్‌ను ముగించాడు. ఇత రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 395 పరుగులకు ఆలౌటైంది.
కాగా 384 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన ఆసిస్ అదరగొడుతోంది. నాలుగో రోజు టీ బ్రేక్ వరకు ఆస్ట్రేలియా 135/0 తో నిలిచింది. ఓపెనర్లు వార్నర్ (58), ఖవాజా (59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కాగా 38 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. ఆసిస్ విజయానికి మరో 249 పరుగులు కావాలి.
-
His final ball faced in Test Cricket? 🤔
— England Cricket (@englandcricket) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A MASSIVE six! ❤️@StuartBroad8 🙌 pic.twitter.com/jHg99Q2nAi
">His final ball faced in Test Cricket? 🤔
— England Cricket (@englandcricket) July 30, 2023
A MASSIVE six! ❤️@StuartBroad8 🙌 pic.twitter.com/jHg99Q2nAiHis final ball faced in Test Cricket? 🤔
— England Cricket (@englandcricket) July 30, 2023
A MASSIVE six! ❤️@StuartBroad8 🙌 pic.twitter.com/jHg99Q2nAi
-
For the final time with the bat…@StuartBroad8 and @Jimmy9 head out to the middle together 🤩
— England Cricket (@englandcricket) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A special moment 🥰#EnglandCricket | #Ashes pic.twitter.com/6sL5K7vuQL
">For the final time with the bat…@StuartBroad8 and @Jimmy9 head out to the middle together 🤩
— England Cricket (@englandcricket) July 30, 2023
A special moment 🥰#EnglandCricket | #Ashes pic.twitter.com/6sL5K7vuQLFor the final time with the bat…@StuartBroad8 and @Jimmy9 head out to the middle together 🤩
— England Cricket (@englandcricket) July 30, 2023
A special moment 🥰#EnglandCricket | #Ashes pic.twitter.com/6sL5K7vuQL
-
Stuart Broad - for everything, thank you ❤️#EnglandCricket | #Ashes pic.twitter.com/TvIFz3VAPV
— England Cricket (@englandcricket) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stuart Broad - for everything, thank you ❤️#EnglandCricket | #Ashes pic.twitter.com/TvIFz3VAPV
— England Cricket (@englandcricket) July 30, 2023Stuart Broad - for everything, thank you ❤️#EnglandCricket | #Ashes pic.twitter.com/TvIFz3VAPV
— England Cricket (@englandcricket) July 30, 2023
-
🏴 Matches: 1️⃣6️⃣7️⃣
— England Cricket (@englandcricket) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
☝️ Wickets: 6️⃣0️⃣2️⃣
🏏 Runs: 3️⃣6️⃣5️⃣4️⃣
🏆 4x Ashes wins
🌍 1x T20 World Cup
🎖️ MBE for services to cricket
Thank you, Broady ❤️
">🏴 Matches: 1️⃣6️⃣7️⃣
— England Cricket (@englandcricket) July 29, 2023
☝️ Wickets: 6️⃣0️⃣2️⃣
🏏 Runs: 3️⃣6️⃣5️⃣4️⃣
🏆 4x Ashes wins
🌍 1x T20 World Cup
🎖️ MBE for services to cricket
Thank you, Broady ❤️🏴 Matches: 1️⃣6️⃣7️⃣
— England Cricket (@englandcricket) July 29, 2023
☝️ Wickets: 6️⃣0️⃣2️⃣
🏏 Runs: 3️⃣6️⃣5️⃣4️⃣
🏆 4x Ashes wins
🌍 1x T20 World Cup
🎖️ MBE for services to cricket
Thank you, Broady ❤️