ETV Bharat / sports

WTC Final: అయ్యో.. ఫైనల్​కు వర్ష గండమా! - డబ్ల్యూటీసీ ఫైనల్​కు వర్షం ముప్పు

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ముమ్మర సాధన చేస్తున్నాయి భారత్, న్యూజిలాండ్. ఈ మ్యాచ్ కోసం అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరిగే సౌథాంప్టన్​కు వర్ష గండం ఉందట.

WTC Final
డబ్ల్యూసీ ఫైనల్
author img

By

Published : Jun 16, 2021, 11:52 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ దుర్వార్త! సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగడం పొంచి ఉంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. దాదాపుగా 80% వర్షం కురుస్తుందనే చూపిస్తున్నాయి.

రోజ్‌బౌల్‌లో శుక్రవారం నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు తుదిపోరు కోసం కఠోర సాధన చేస్తున్నాయి. రెండూ అత్యుత్తమ జట్లే కావడం వల్ల ఐదు రోజుల పాటు ఆటను ఆస్వాదించాలని అభిమానులు భావిస్తున్నారు. అవాంతరాలు ఎదురైనా రిజర్వు డే ఉందని సంతోషించారు. ఇప్పుడు ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం ఉందని తెలియడం వల్ల ఉసూరుమంటున్నారు.

వర్షం పడి చల్లని వాతావరణ ఉంటే మాత్రం కివీస్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. సౌథీ, బౌల్ట్‌, హెన్రీ, జేమీసన్‌ తమ పేస్‌, స్వింగ్‌తో భారత్‌ బ్యాటర్లను ఇబ్బంది పెడతారని అంటున్నారు. టీమ్‌ఇండియా బౌలర్లూ తక్కువేం కాదని మొత్తంగా బ్యాటర్లకే ఇబ్బందులు ఉంటాయని పేర్కొంటున్నారు.

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ కూడా ఫైనల్‌కు పొంచివున్న వర్షగండంపై ట్వీట్‌ చేశాడు. జూన్‌ 18 నుంచి 23 వరకు సౌథాంప్టన్‌ వాతావరణం ఎలా ఉంటుందో కొన్ని వివరాలు పోస్ట్‌ చేశాడు. ఆట ఆరంభానికి ముందే అంటే గురువారమే వర్షం మొదలవుతుందన్నది అతడి ఉద్దేశం. ఈ ప్రకారం కోహ్లీసేన, విలియమ్సన్‌ కీలకమైన గురువారం సాధన చేసేందుకు అవకాశమే దొరక్కపోవచ్చు. వర్షం మొత్తంగా అంతరాయం కలిగిస్తే భారత్‌, న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.

ఇప్పటికే న్యూజిలాండ్‌ ఐసీసీ టోర్నీల్లో ‘టై’ గండాలు ఎదుర్కొంటోంది. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మ్యాచులో, సూపర్‌ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ప్రపంచకప్‌ ట్రోఫీ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంయుక్త విజేతగా ప్రకటించడం మాత్రం ఊరట కలిగించేదే.

ఇవీ చూడండి: ఐపీఎల్ క్రికెటర్​పై నిషేధం తొలగించిన బీసీసీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.