ODI World Cup 2023 South Africa vs Australia : వన్డే ప్రపంచ కప్ - 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలోనే ఆలౌటైంది. 177 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు ఏకంగా 134 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా, వరల్డ్ కప్ టైటిల్ ఫెవరెట్ ఆస్ట్రేలియాకు ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో ఓటమి. మొదట టీమ్ఇండియా చేతుల్లో 199 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 134 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
లక్ష్యఛేదనలో ఆసీస్ మొదటి ఓవర్లు నిలకడగానే ఆడింది. కానీ ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోయింది. 15 బంతుల్లో 7 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔట్ అవ్వగా... 27 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 16 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్... రబాడా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన జోష్.. రబాడా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అవ్వగా... 17 బంతులు ఆడి 3 పరుగులు మాత్రమే చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఇక స్టాయినిస్.. రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలా 70 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆసీస్ జట్టు. ఈ క్రమంలో లబుషేన్.. స్టార్క్‌తో జత కట్టాడు. వీరు నిలకడగా ఆడి పరుగులు సాధించారు. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో స్టార్క్.. డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. మహారాజ్ వేసిన తర్వాత ఓవర్‌లోనే లబుషేన్ కూడా ఔటయ్యాడు. అనంతరం షంసి ఒకే ఓవర్‌లో కమిన్స్, హేజిల్‌వుడ్ (2)ను ఔట్ చేయడంతో ఆసీస్ ఆలౌటైంది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ 109 పరుగులు సాధించి, ప్రపంచ కప్‌లో రెండో సెంచరీ చేశాడు. మార్క్‌రమ్ 56 పరుగులు చేయగా, కెప్టెన్ తెంబ బవుమా 35, వాన్ దేర్ దుస్సేన్ 26, హెన్రీచ్ క్లాసిన్ 29 పరుగులు చేశారు.
-
All-round excellence helps South Africa continue their victorious run in the #CWC23 💪#AUSvSA 📝: https://t.co/GS4t9OwQlM pic.twitter.com/lOmGGsHblI
— ICC (@ICC) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">All-round excellence helps South Africa continue their victorious run in the #CWC23 💪#AUSvSA 📝: https://t.co/GS4t9OwQlM pic.twitter.com/lOmGGsHblI
— ICC (@ICC) October 12, 2023All-round excellence helps South Africa continue their victorious run in the #CWC23 💪#AUSvSA 📝: https://t.co/GS4t9OwQlM pic.twitter.com/lOmGGsHblI
— ICC (@ICC) October 12, 2023