ETV Bharat / sports

Kohli Funny Run Viral Video : 'ఏంటీ కోహ్లీ అలా పరిగెడుతున్నావ్​?'.. ఒక్కసారిగా అంతా నవ్వులే నవ్వులు! - ఆసియా కప్​ విరాట్​ కోహ్లీ

Kohli Funny Run Viral Video : 2023 ఆసియా కప్​ సూపర్​ 4లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి వాటర్​ బాయ్​గా మారాడు. డ్రింక్స్​ అందిస్తున్న సమయంలో అతడు పరుగు చూసి అంతా నవ్వుకున్నారు. మరి మీరు ఆ వీడియో చూశారా?

Kohli Funny Run Viral Video
Kohli Funny Run Viral Video
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 6:07 PM IST

Updated : Sep 15, 2023, 6:30 PM IST

Kohli Funny Run Viral Video : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ.. మైదానంలో ఎంత దూకుడు ఉంటాడో.. బయట కూడా అంతే సరదాగా కనిపిస్తాడు. తన చిలిపి పనులతో అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లను నవ్విస్తాడు. స్టేడియంలోని ప్లే అవుతున్న పాటలకు కాలు కదుపుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొడితే.. తనదైన శైలిలో బదులిస్తాడు. తాజాగా విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ప్రేక్షకులతో పాటు అంపైర్లు, ఆటగాళ్లు, కామెంటేటర్లు విరగబడి నవ్వుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Asia Cup 2023 IND Vs BAN : ఆసియా కప్​ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్ఇండియా 5 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా.. గత మ్యాచ్​ హీరో, స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్, మహమ్మద్​ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యకు మేనేజ్​మెంట్ రెస్ట్ ఇచ్చింది. వాళ్ల స్థానంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ టూర్​లో టీ20 క్రికెట్​లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఇప్పుడు వన్డేల్లో అడుగుపెట్టాడు.

అయితే ఈ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చినా.. అతడు 12వ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సేవలందించడంతో పాటు వాటర్ బాయ్ పాత్రలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తున్నాడు. వేల కోట్ల అధిపతి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ఏ మాత్రం నామోషీ లేకుండా డ్రింక్స్ అందిస్తున్నాడు.

Virat Kohli Running Video : డ్రింక్స్ అందించడాన్ని కూడా కోహ్లీ తనదైన శైలిలో ఆస్వాదిస్తున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ అనముల్ హక్ (4) ఔటైన తర్వాత.. టీమ్ఇండియా ప్లేయర్లకు డ్రింక్స్ ఇవ్వడానికి గ్రౌండ్​లోకి వెళ్లాడు. మైదానంలోకి వచ్చే క్రమంలో ఫన్నీగా రన్ చేస్తూ అందర్నీ నవ్వించాడు. కోహ్లీని చూసి భారత ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఫ్యాన్స్ కూడా కోహ్లీ చర్యకు ఫిదా అయ్యారు.

Maxwell Baby : తండ్రైన ఆసీస్ స్టార్ బ్యాటర్ మ్యాక్స్​వెల్.. చిన్నారి పేరేంటంటే?

World Cup 2023 Semi Final Tickets : క్రికెట్ ఫ్యాన్స్​కు అలర్ట్.. ఫైనల్ మ్యాచ్​ టికెట్ల సేల్​ స్టార్ట్​.. మీరు రెడీనా?

Last Updated : Sep 15, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.