ETV Bharat / sports

ఫీజు చెల్లించలేదని పీఎస్​ఎల్​ నుంచి క్రికెటర్ వాకౌట్ - పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

James Faulkner PSL: పీఎస్​ఎల్​లో ఆడినందుకు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు తనకు ఫీజు చెల్లించలేదంటూ ఆరోపణలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జేమ్స్​ ఫాల్కనర్. దీనిపై స్పందించిన పీసీబీ ఫాల్కనర్​కు అన్ని చెల్లింపులు చేశామని పేర్కొంది. ఫాల్కనర్​ వ్యాఖ్యలను తప్పుపడుతూ అతనిపై నిషేధం విధించింది.

james faulkner
ఫాల్కనర్
author img

By

Published : Feb 19, 2022, 8:26 PM IST

James Faulkner PSL: పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో బిజీగా ఉన్న పాక్ క్రికెట్​ బోర్డుకు ఊహించని షాక్​ తగిలింది. లీగ్​లో క్వెట్టా గ్లాడియేటర్స్​కు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్​ బౌలర్​ జేమ్స్​ ఫాల్కనర్​ ఆ లీగ్​ నుంచి నిష్క్రమించాడు. పీసీబీ.. ఒప్పందంలో భాగంగా తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని బాకీ ఉంచిందని అతడు ఆరోపించాడు. ఈ మేరకు శనివారం ట్వీట్​ చేశాడు.

"పాకిస్థాన్​ క్రికెట్​ అభిమానులకు క్షమాపణలు. కానీ దురదృష్టవశాత్తు మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉండగానే నేను లీగ్​ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. పీసీబీ నా ఫీజును చెల్లించకపోవడమే అందుకు కారణం. నేను ఇంతకాలం వేచి చూసినా ఇంకా వారు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. పాకిస్థాన్​లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​ను తీసుకురావడంలో నా వంతు కృషి చేద్దామని అనుకున్న నాకు ఇలా మధ్యంతరంగా వెళ్లి పోవడం బాధ కలిగిస్తోంది. కానీ ఇక్కడ నాతో బోర్డు వ్యవహరించిన తీరుకు నిష్క్రమించక తప్పట్లేదు. మీరందరూ నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను"

-జేమ్స్​ ఫాల్కనర్​, ఆస్ట్రేలియా మాజీ బౌలర్

అందులో నిజం లేదు..

ఫాల్కనర్​ ఆరోపణలపై స్పందించిన పీసీబీ, క్వెట్టా గ్లాడియేటర్స్​ యాజమాన్యం .. అవన్నీ అర్థరహిత ఆరోపణలని తోసిపుచ్చాయి. ఇందుకు సంబంధించి సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఫాల్కనర్​పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.

" మాపైన ఫాల్కనర్​ ఈ తరహా ఆరోపణలు చేసినందుకు చింతిస్తున్నాం. గతేడాది నుంచే పీఎస్​లో భాగమైన ఫాల్కనర్​కు ఏ లోటు రాకుండా చూసుకున్నాం. ఈ ఏడేళ్లలో ఏ ఆటగాడు కూడా మాపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. మేం చేస్తున్న కృషికి వారు ప్రశంసించేవారు."

-పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

లేఖలోని మరిన్ని వివరాలు..

ఫాల్కనర్​కు 70 శాతం ఫీజును చెల్లించేశామని.. మిగిలిన 30 శాతానికి పీఎస్ఎల్​ లీగ్​ ముగిసిన 40 రోజుల దాకా గడువుందని స్పష్టం చేసింది పీసీబీ. ప్రస్తుతం ఫాల్కనర్​కు ఎలాంటి బాకీలు లేమని పేర్కొంది.

"2021 డిసెంబరులో ఫాల్కనర్​ ఏజెంట్.. ఫీజు చెల్లింపుల కోసం​ యూకేలోని బ్యాంకు అకౌంట్​ వివరాలు ఇచ్చాడు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని బ్యాంక్​ అకౌంట్​కే ఫీజు పంపాలంటూ ఆ వివరాలు అందించాడు. కానీ ఫాల్కనర్​కు మేం అతని పాత అకౌంట్​కే 70 శాతం ఫీజును చెల్లించాం. తనకు డబ్బులు అందినట్టు ఫాల్కనర్​ కూడా నిర్ధరించాడు."

-పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

ఇదీ చూడండి : టీ20ల్లో రోహిత్​ రికార్డును సమం చేసిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.