ETV Bharat / sports

దేవ్​దత్​ పడిక్కల్‌ అలా ఎలా!

దేవ్​దత్​ పడిక్కల్​ కరోనా నుంచి కోలుకుని నేరుగా బయో బబుల్​లో బెంగళూరు జట్టుతో చేరటంపై మిగతా ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. క్వారంటైన్‌ ముగిశాక కొవిడ్‌ పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్‌ వస్తేనే బయో బబుల్‌లో అడుగుపెట్టాలి.

Devdutt padikkal
దేవ్​దత్​ పడిక్కల్‌
author img

By

Published : Apr 11, 2021, 6:56 AM IST

కొవిడ్‌-19 నుంచి కోలుకున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ నేరుగా బయో బబుల్‌లో బెంగళూరు జట్టుతో చేరడంపై మిగతా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అతణ్ని జట్టులో చేర్చుకునే క్రమంలో బీసీసీఐ విధించిన నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.

పాజిటివ్‌ వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉన్న పడిక్కల్‌ నెగిటివ్‌ వచ్చాక నేరుగా జట్టుతో చేరిపోయాడు. పడిక్కల్‌కు మార్చి 22న పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి అతడు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కోలుకున్నాక ఏప్రిల్‌ 7న చెన్నైలో బబుల్‌లో అడుగుపెట్టాడు. బెంగళూరు నుంచి అతడు కారులో చెన్నై వెళ్లాడు.

రెండు నెగిటివ్‌ ఫలితాల తర్వాత అతణ్ని నేరుగా బబుల్‌లోకి అనుమతించారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు జట్టుతో చేరడానికి ముందు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. జట్టుతో కలిసి ఏ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. క్వారంటైన్‌ ముగిశాక కొవిడ్‌ పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్‌ వస్తేనే బయో బబుల్‌లో అడుగుపెట్టాలి.

ఇదీ చూడండి: ఐపీఎల్: హైదరాబాద్​ తొలి పంచ్​ ఇస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.