గడ్డం పెంచడమనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్‌గా మారింది. కానీ దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ మాత్రం గడ్డం కాస్త పెరిగినా.. కంగారు పడిపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు తాను నీట్‌గా షేవ్ చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోందని వెల్లడించాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు.
"మ్యాచ్ రోజు టీవీలో కాస్త గడ్డంతో కనిపించినా.. నా భార్య విడాకులు ఇవ్వొచ్చు. అందుకే ప్రతి మ్యాచ్‌కు ముందు నీట్‌గా గడ్డం గీసుకుంటాను. నాకు ఇదొక ఆచారంగా మారింది. ఇలాంటి సందర్భం ఎవరికైనా ఎదురైందో.. లేదో తెలీదు. నేను మాత్రం తప్పకుండా గడ్డం తీయాల్సిందే."
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్.
చెన్నైతో మ్యాచ్‌కు ముందు తమ జట్టు ఆటగాళ్లతో పాంటింగ్ మాట్లాడిన వీడియో ఒకటి ట్విట్టర్లో పంచుకుంది దిల్లీ క్యాపిటల్స్.
ఇదీ చదవండి: నరైన్, షకిబ్ ఇద్దరూ ఒకటే: మోర్గాన్
'అయితే మ్యాచ్ రోజు పాంటింగ్‌కు, కబీర్ ఖాన్‌కు మధ్య గడ్డం మాత్రమే తేడా' అని దిల్లీ మరొక వీడియోను షేర్ చేసింది. ఇందులో పాంటింగ్ తన నీట్ షేవ్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు.
ఇదీ చదవండి: రెండో మ్యాచ్‌కు ముందు ధోనీసేనకు ఎదురుదెబ్బ!